Mirabai Chanu: ‘ఈ పతకం దేశ ప్రజలకు అంకితం.. వారి సహాయం లేకుంటే విజయం కఠినమయ్యేది’

Tokyo Olympics 2020: మీరాబాయి చాను ఒలింపిక్స్‌లో 202 కిలోలు (87 కిలోలు + 115 కిలోలు) ఎత్తి, వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది.

Mirabai Chanu: 'ఈ పతకం దేశ ప్రజలకు అంకితం.. వారి సహాయం లేకుంటే విజయం కఠినమయ్యేది'
Mirabai Chanu With Ministers
Follow us
Venkata Chari

|

Updated on: Jul 27, 2021 | 9:42 AM

Tokyo Olympics 2020: ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్‌లో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను.. భారతదేశానికి సోమవారం తిరిగి వచ్చారు. ఈమేరకు దేశ ప్రజలకు తన రజత పతకాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రభుత్వ సహకారం లేకపోతే ఒలింపిక్స్‌లో తన కల నెరవేరదని పేర్కొన్నారు. క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ నివాసంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మీరాబాయి మాట్లాడారు. ‘నేటికి నా కల నిజమైంది. ఈ పతకాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నాను. నన్ను ప్రోత్సహించిన, నాకోసం ప్రార్థించిన వారందరికీ ఈ పతకాన్ని అంకితం చేస్తున్నానని’ ఆమె పేర్కొన్నారు. 49 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోల (87 కిలోల + 115 కిలోలు) బరువును ఎత్తి, రెండవ స్థానంలో నిలిచి, రజత పతంక గెలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి చాను.. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో దేశానికి పతకం అందించిన రెండోవ వ్యక్తిగా పేరుగాంచారు. అంతకుముందు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించారు.

మీరాబాయి చాను మాట్లాడుతూ, ‘నేను ప్రధాని, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా తక్కువ సమయంలో నన్ను ప్రాక్టీస్ కోసం అమెరికాకు పంపించేందుకు ఒక్క రోజులో ఏర్పాట్లు చేశారు. అందువల్లే నాకు మంచి శిక్షణ లభించింది. ఈ కఠిన శిక్షణతోనే నేను పతకాన్ని సాధించగలిగాను’ అంటూ సంతోషం వ్యక్తి చేశారు. ఈ సందర్భంగా చాను కోచ్ విజయ్ శర్మ మాట్లాడుతూ.. ‘ఇది ప్రారంభం మాత్రమే, భారత ఆటగాళ్లు రాబోయే రోజుల్లో ఎక్కువ పతకాలు సాధిస్తారని’ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి నిషిత్ ప్రమాణిక్, కేంద్ర మంత్రులు కిరెన్ రిజిజు, సర్బానంద సోనోవాల్, జి. కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రిజిజు, సోనోవాల్ గతంలో క్రీడా మంత్రులుగా పనిచేశారు.

మీరాబాయి ఆట స్ఫూర్తిని పెంచింది హిమాచల ప్రదేశ్ టోపీ, శాలువాలతో చానుతోపాటు ఆమె కోచ్‌ను అనురాగ్ ఠాకూర్ సత్కరించారు. ఒలింపిక్స్‌లో మొదటి రోజే మీరాబాయి పతకం సాధించి, అందరిలో స్ఫూర్తిని పెంచిదని ఠాకూర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, ‘ఒలింపిక్ క్రీడల మొదటి రోజునే చాను పతకం సాధించి మిగతా ఆటగాళ్లలను ప్రోత్సహించింది. మీ విజయం ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని’ ఆయన తెలిపారు. స్వేదేశానికి వచ్చిన మీరాబాయికి విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానును రాష్ట్ర పోలీసు విభాగంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా నియమిస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్ సోమవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమెకు కోటి రూపాయల బహుమతిని అందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

Also Read: Tokyo Olympics 2020: ప్రమోషన్‌తోపాటు రూ. 2 కోట్లు.. మీరాబాయి చానుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన భారతీయ రైల్వే

Tokyo Olympics 2020 Live: స్పెయిన్‌పై 3-0 తేడాతో భారత హాకీ జట్టు విజయం.. రెండవ రౌండ్లో గురి తప్పిన మను-సౌరభ్ జోడీ

వరుసగా 8 ఓవర్లు మెయిడిన్ చేసిన ‘ది గ్రేట్ బౌలర్’..! వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన రికార్డ్..