Viral Video: ఇతని ఆటకు లిటిల్ మాస్టర్ ఫిదా.. క్యారమ్స్ ఎలా ఆడుతున్నాడో మీరూ చూడండి..! వైరలవుతోన్న వీడియో

Venkata Chari

Venkata Chari |

Updated on: Jul 27, 2021 | 12:31 PM

క్రికెట్‌లోనే కాదు నెట్టింట్లోనూ టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. తన అభిమానులకు అప్పుడప్పుడు స్ఫూర్తిని కలిగించేలా పోస్టులను షేర్ చేస్తుంటాడు.

Viral Video: ఇతని ఆటకు లిటిల్ మాస్టర్ ఫిదా.. క్యారమ్స్ ఎలా ఆడుతున్నాడో మీరూ చూడండి..! వైరలవుతోన్న వీడియో
Sachin Shares Viral Video

Viral Video: క్రికెట్‌లోనే కాదు నెట్టింట్లోనూ టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. తన అభిమానులకు అప్పుడప్పుడు స్ఫూర్తిని కలిగించేలా పోస్టులను షేర్ చేస్తుంటాడు. సచిన్ షేర్ చేసే వీడియోలు ఎంతో ఆకట్టుకుంటాయనడంతో సందేహం లేదు. అంతకుముందు ఓసారి రుబిక్స్ ఆడే కుర్రాడి ప్రతిభను మెచ్చుకుంటూ ఓ వీడియో విడుదల చేశాడు. దాంతో అతను రుబిక్స్ హీరోగా పేరుగాంచాడు. తాజాగా మరో ఆకట్టుకునే వీడియోతో నెట్టింట్లోకి చేరాడు మన మాస్టర్ బ్లాస్టర్. వివరాల్లోకి వెళ్తే.. హర్షద్ గోతంకర్ అనే వ్యక్తికి చేతులు లేవు. ఏపనిచేసినా తన కాళ్లతోనే. అయితే ఆయన డిక్షనరీలో ఇంపాజిబుల్ అనే పదం లేదని నిరూపిస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి క్యారమ్స్ ఆడుతూ ఈ వీడియోలో కనిపించాడు. ఈ సీన్‌ సచిన్‌కు బాగా నచ్చింది. ఎందుకంటే.. కాళ్లతోనే గోతంకర్ క్యారమ్స్ ఆడుతున్నాడు. ఈమేరకు ఈ వీడియోను సోషల్ మీడియాలో మాస్టర్ బ్లాస్టర్ పంచుకున్నాడు.

ఈమేరకు ‘ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న ఈ వ్యక్తి సంకల్ప బలం ముందు అన్నీ చిన్న బోతాయి. ఇతని ప్రేరణను మనమంతా ప్రేమించాలి. అతని నుంచి చాలా నేర్చుకోవచ్చు’ అంటూ ఈ వీడియోను పంచుకున్నాడు. ఈవీడియో ప్రస్తుతం 90,000వేల వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది. 12,000 మందికి పైగా లైక్ చేశారు. చాలామంది తమ కామెంట్లను పంచుకున్నారు.

అద్భుతమైన ప్రతిభ అతనిలో దాగుందని కొందరు కామెంట్ చేస్తే.. ఇలా జీవించాలంటే చాలా ఓర్పు, సహనం కావాలని మరికొందరు కామెంట్ చేశారు. ఈ వ్యక్తిని చూస్తే వెంటనే స్ఫూర్తిని అందుకోవచ్చంటూ కొందరు.. తన బలహీనతను జయించి దూసుకపోతున్న ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటారని కామెంట్లు చేశారు.

Also Read: Viral Video: కోడలా మజాకా.. అత్తగారిపై ప్రేమతో ఏకంగా 60 రకాల వంటకాలు.. క్రేజీ వీడియో వైరల్!

Viral Video: ఇదేందిది క్రికెట్‌లో ఎప్పుడూ చూడలే.. దెయ్యం తీసిన వికెట్ చూశారా? అంటూ నెటిజన్ల కామెంట్లు.. వీడియో చూస్తే కచ్చితంగా షాకవుతారు..!

Viral Video: శిష్యురాలు గెలిచింది.. కోచ్‌ చేసిన సందడి మాములుగా లేదుగా..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu