Viral Video: ఇదేందిది క్రికెట్‌లో ఎప్పుడూ చూడలే.. దెయ్యం తీసిన వికెట్ చూశారా? అంటూ నెటిజన్ల కామెంట్లు.. వీడియో చూస్తే కచ్చితంగా షాకవుతారు..!
క్రికెట్‌లో వింత సంఘటలను కొన్ని మనం చూసేఉన్నాం. బ్యాట్స్‌మెన్లు షాకవుతూ పెవిలియన్‌కు చేరడం, ఫీల్డర్లు ఔరా అనింపిచేలా రనౌట్లు చేయడం, సాధ్యం కాని క్యాచ్‌లు పట్టుకోవడం లాంటివి ఇలా ఎన్నో చూశాం. అయితే జింబాబ్వే- బంగ్లాదేశ్ టీంల మధ్య జరిగిన టీ20లో ఓ వింత చోటు చేసుకుంది.
Viral Video: క్రికెట్‌లో వింత సంఘటలను కొన్ని మనం చూసేఉన్నాం. బ్యాట్స్‌మెన్లు షాకవుతూ పెవిలియన్‌కు చేరడం, ఫీల్డర్లు ఔరా అనింపిచేలా రనౌట్లు చేయడం, సాధ్యం కాని క్యాచ్‌లు పట్టుకోవడం లాంటివి ఇలా ఎన్నో చూశాం. అయితే జింబాబ్వే- బంగ్లాదేశ్ టీంల మధ్య జరిగిన టీ20లో ఓ వింత చోటు చేసుకుంది. దీన్ని చూసిన వారంతా ఇలా ఎలా జరిగిందంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక నెటిజన్లు అయితే ఫన్నీ కామెంట్లతో సందడి చేస్తున్నారు. ఇలాంటి ఘటన క్రికెట్ చరిత్రలో ఇంత వరకు మనం చూడలేదు కూడా. అసలు విషయానికి వస్తే.. హరారే వేదికగా బంగ్లాదేశ్, జింబాబ్వే టీంలు రెండవ టీ20లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో వింత చోటుచేసుకుంది. బంగ్లా బ్యాట్స్‌మెన్ మహమ్ముద్ సైఫుద్దీన్ క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్ టెండాయ్ చతారా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే, ఈ ఓవర్‌లో ఐదో బంతి వేయకముందే.. బెయిల్స్ కిందపడిపోయాయి. బాల్ అసలు బ్యాట్స్‌మెన్ వెనుకకు రానేలేదు. పైగా బ్యాట్స్‌మెన్ ఆ బంతిని ఫుల్ షాట్ ఆడాడు కూడా. కానీ, బెయిల్స్ వాటంతంట అవే పడిపోవడం మాత్రం ఓ మాయలా కనిపించింది. దాంతో వెనుకకు తిరిగి చూసిన బ్యాట్స్‌మెన్ మహమ్ముద్ సైఫుద్దీన్ నోరెళ్లబెట్టాడు. ఇలా ఎలా జరిగిందంటూ అంతా ఆశ్చర్యపోయారు. కాగా, ఫీల్డ్ అంపైర్లు క్లారిటీ కోసం థర్డ్ అంపైర్‌కు కాల్ చేశారు. రీప్లేల్లో బ్యాట్స్‌మెన్ స్టంప్స్‌కు తగల్లేదని అర్థమైంది. మరి బెయిల్స్ ఎలా పడిపోయాయో అర్థం కావడం లేదు.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. గాలి వల్లనే బెయిల్స్ కిందపడి ఉండొచ్చని కొందరు కామెంట్ చేస్తుంటే.. కాదు స్టేడియంలో దెయ్యమే ఇలా చేసిందంటూ మరింకొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఒకేవళ గాలితోనే అలా బెయిట్ కింద పడితే.. స్టంప్స్ ఎలా కదిలాయంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ టైంలో గాలి కూడా ఎక్కువగా లేవపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే దెయ్యం తీసిన వికెట్ అంటూ, క్రికెట్ చరిత్రలో ఇలా వికెట్ పడేయడం ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిచి బంగ్లాకు షాకిచ్చింది. కాగా మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. అలాగే అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను కూడా బంగ్లాదేశ్ గెలుచుకుంది.
First ever wicket taken by a ghost ?? pic.twitter.com/9vG0BI50S4
— Mazher Arshad (@MazherArshad) July 24, 2021
Also Read: Viral Video: శిష్యురాలు గెలిచింది.. కోచ్ చేసిన సందడి మాములుగా లేదుగా..!
Viral Video: శిష్యురాలు గెలిచింది.. కోచ్ చేసిన సందడి మాములుగా లేదుగా..!
Viral Video: మురికినీటితో ప్లేట్‌లను కడుగుతున్న వ్యాపారి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!