KKR vs SRH Playing XI: పేపర్‌పై హీరోలు.. మైదానంలో జీరోలు.. కోల్‌కతాపై వ్యూహం మార్చిన హైదరాబాద్?
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Probable Playing XI: ఐపీఎల్ (IPL) 2025 రెండవ వారానికి చేరుకుంది. మరోవైపు ఈ టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠగా ముందుకు సాగుతున్నాయి. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు జరిగిన 14 మ్యాచ్‌లలో హోరాహోరీ పోరును ప్రేక్షకులు చూశారు. ఏప్రిల్ 3న ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది.

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Probable Playing XI: ఐపీఎల్ (IPL) 2025 రెండవ వారానికి చేరుకుంది. మరోవైపు ఈ టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠగా ముందుకు సాగుతున్నాయి. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు జరిగిన 14 మ్యాచ్‌లలో హోరాహోరీ పోరును ప్రేక్షకులు చూశారు. ఏప్రిల్ 3న ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది. ఒకవైపు, హైదరాబాద్ తన మునుపటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత కోల్‌కతాకు చేరుకుంటోంది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా 2 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది.
ఇప్పుడు రెండు జట్ల ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే.. ముందుగా కోల్‌కతా గురించి చూద్దాం.. కేకేఆర్ జట్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా ఉన్నాడు. హైదరాబాద్ జట్టు ఆధిక్యం పాట్ కమ్మిన్స్ చేతిలో ఉంది. హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఓసారి చూద్దాం..
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ 11: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
ఇంపాక్ట్ ప్లేయర్స్: అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే.
కేకేఆర్ ప్లేయింగ్ 11 లో ఎంత మంది బ్యాట్స్ మెన్స్, బౌలర్లు, ఆల్ రౌండర్లు ఉన్నారో ఓసారి చూద్దాం..
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్, బ్యాట్స్ మాన్)
సునీల్ నరైన్ (ఆల్ రౌండర్)
కెప్టెన్ అజింక్య రహానే (బ్యాట్స్‌మన్)
వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ (ఆల్ రౌండర్)
రింకు సింగ్ (బ్యాట్స్‌మన్)
ఆండ్రీ రస్సెల్ (ఆల్ రౌండర్)
రమణ్‌దీప్ సింగ్ (ఆల్ రౌండర్)
స్పెన్సర్ జాన్సన్ (బౌలర్)
హర్షిత్ రాణా (బౌలర్)
వైభవ్ అరోరా (బౌలర్)
వరుణ్ చక్రవర్తి (బౌలర్)
హైదరాబాద్ ప్లేయింగ్ 11..
ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.
ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ జంపా.
గత మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపించిన ట్రావిస్ హెడ్ ఖచ్చితంగా మరోసారి బ్యాటింగ్ ప్రారంభిస్తాడు. భారత స్టార్ అభిషేక్ శర్మ అతనికి మద్దతుగా వస్తాడు. ఇషాన్ కిషన్ మూడవ స్థానంలో బరిలోకి దిగనుండగా, నితీష్ కుమార్ రెడ్డి నాలుగో స్థానంలో, హెన్రిచ్ క్లాసెన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు రావొచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 లో ఎంత మంది బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు, ఆల్ రౌండర్లు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం:
ట్రావిస్ హెడ్ (బ్యాట్స్ మాన్)
అభిషేక్ శర్మ (ఆల్ రౌండర్)
ఇషాన్ కిషన్ (బ్యాట్స్‌మన్)
హెన్రిచ్ క్లాసెన్ (బ్యాట్స్ మాన్)
నితీష్ కుమార్ రెడ్డి (ఆల్ రౌండర్)
అభినవ్ మనోహర్ (బ్యాట్స్‌మ్యాన్)
పాట్ కమ్మిన్స్ (బౌలర్)
హర్షల్ పటేల్ (ఆల్ రౌండర్)
మహ్మద్ షమీ (బౌలర్)
ఆడమ్ జంపా (బౌలర్)
రాహుల్ చాహర్ (బౌలర్).
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..