AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCBపై గెలుపు తర్వాత గిల్ ఆసక్తికర పోస్ట్.. ఆక్రికెటర్‌ను ఉద్దేశించేనా?.

IPL 2025: ఆర్సీబీపై గెలుపు తర్వాత "X" లో గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. మా దృష్టి ఎప్పుడూ ఆటపైనే ఉంటుంది...శబ్ధం మీద కాదు అని గిల్ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌పై స్పందించిన అభిమానులు ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కౌంటర్‌గానే పోస్ట్ చేశారని కామెంట్స్‌ పెడుతున్నారు.

RCBపై గెలుపు తర్వాత గిల్ ఆసక్తికర పోస్ట్.. ఆక్రికెటర్‌ను ఉద్దేశించేనా?.
Gill On Virat 1 Copy
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 03, 2025 | 3:24 PM

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సొంత గడ్డపై ఆర్సీబీని చిత్తు చేసిన తర్వాత గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. మా దృష్టి ఎప్పుడూ ఆటపైనే ఉంటుంది…శబ్ధం మీద కాదు అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే గిల్ ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఉద్దేశించే పోస్ట్ పెట్టి ఉంటాడని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు గిల్ కోహ్లీని ఉద్ధేశించి ఎందుకు పోస్ట్ చేస్తాడు..అది నిజమేనా?

సహజంగా ఆడే ప్రతి మ్యాచ్‌లో తన చేష్టలతో విరాట్ అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటాడూ.. అదే విధంగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లోనూ గిల్ వికెట్ పడినప్పుడూ టీమ్ సభ్యులతో విరాట్ సంబరాలు చేసుకున్నాడు. అయితే మ్యాచ్ లో గుజరాత్ ఆర్సీబీపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ సోషల్ మీడియాలో మా దృష్టి ఎప్పుడూ ఆటపైనే ఉంటుంది…శబ్ధం మీద కాదు అనే క్యాప్షన్ తో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన అభిమానులు కోహ్లీకి కౌంటర్‌గానే గిల్ ఈ పోస్ట్ పెట్టారని కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉండగా సీజన్ తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ చేతిలో గుజరాత్ ఓడిపోవడంతో గిల్ కెప్టెన్సీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో ఆతర్వాత ఆడిన రెండు మ్యాచుల్లో గుజరాత్ వరుస విజయాలను అందుకుంది. పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత ముంబై, ఆర్సీబీతో తలబడిన గుజరాత్ రెండు మ్యాచుల్లోని విజయం సాధించి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. అయితే తనపై వచ్చిన కామెంట్స్‌కు కౌంటర్‌గానే గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ ఈ పోస్ట్ పెట్టి ఉంటారని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..