AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs DC: ఢిల్లీ దెబ్బ ఆర్సీబీ అబ్బ.. చిన్న స్వామిలో బౌలర్స్‌కు చుక్కలు చూపించిన రాహుల్!

IPL 2025: ఐపీఎల్‌ సీజన్‌ 18లో దిల్లీ క్యాపిటల్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. పోటీకి వచ్చే జట్టు ఏదైనా సరే ఢీ కొట్టి నిలబడుతోంది. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయకేతనం ఎగురవేసింది. నిన్న చిన్న స్వామి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్ విధ్వంసం సృష్టించాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

RCB vs DC: ఢిల్లీ దెబ్బ ఆర్సీబీ అబ్బ.. చిన్న స్వామిలో బౌలర్స్‌కు చుక్కలు చూపించిన రాహుల్!
Delhi Won
Anand T
|

Updated on: Apr 11, 2025 | 9:00 AM

Share

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరులో బ్యాటర్లలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, టిమ్‌ డేవిడ్‌ మినహా ఎవరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో ఆర్సీబీ ఢిల్లీకి భారీ టార్గెట్‌ను ఇవ్వలేకపోయింది. ఇక లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి స్టార్టింగ్‌లోనే ఆర్సీబీ బౌలర్స్‌ షాక్‌ ఇచ్చారు. ఓపెనర్స్‌గా వచ్చిన డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్‌ను డబుల్ డిజిట్‌ పరుగులు చేయకముందే వెనక్కి పంపారు. తొలుత డుప్లెసిస్‌ వికెట్‌ను యశ్‌ దయాళ్‌ తీయగా.. ఆ తర్వాత వచ్చిన భువనేశ్వర్ జేక్ ఫ్రేజర్ (7), అభిషేక్ పొరెల్ (7)ని వెనక్కి పంపాడు. ఇక తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ కూడా అంతగా రాణించలేక పోయాడు. కేలవం 15 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. ఇక బెంగళూరు బౌలర్స్‌ దెబ్బకు ఢిల్లీ స్కోర్ డీలా పడిపోయింది. 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్‌ రాహుల్ ఆర్సీబీ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. ఫోర్‌లు, సిక్స్‌లతో ఆర్సీబీ బౌలర్స్‌పై విరుచుకు పడ్డాడు. కేవలం 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఢిల్లీ స్కోర్ బోర్డు అమాంతం పెరిగిపోయింది. రాహుల్ దూకుడుతో 17.5 ఓవర్లలోనే ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్‌ను ఢిల్లీ చేధించగలిగింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2, యశ్‌ దయాళ్‌, సుయాశ్‌ శర్మ ఒక్కో వికెట్‌ తీశారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో