KL Rahul Catch Drop: సింపుల్ క్యాచ్ మిస్ చేసిన కేఎల్ రాహుల్.. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన రెండో టెస్ట్ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆట ప్రారంభంలోనే టీమిండియా నుంచి ఒక పెద్ద పొరపాటు జరిగింది.

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన రెండో టెస్ట్ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆట ప్రారంభంలోనే టీమిండియా నుంచి ఒక పెద్ద పొరపాటు జరిగింది. దీని కారణంగా జట్టుకు ఏకంగా 66 పరుగుల నష్టం జరిగింది. అదే సమయంలో సౌతాఫ్రికా జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది.
సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో భారత జట్టుకు ఒక కీలకమైన వికెట్ పడే అవకాశం వచ్చింది.. కానీ కేఎల్ రాహుల్ చేసిన పెద్ద పొరపాటు జట్టుకు నష్టాన్ని మిగిల్చింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎయిడెన్ మార్కరమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రాహుల్ జారవిడిచాడు. మ్యాచ్ ఆరంభంలోనే బుమ్రా మార్కరమ్‌పై నిరంతరం ఒత్తిడి పెడుతూ, అతన్ని క్యాచ్ ఇచ్చేలా చేయడంలో విజయం సాధించాడు. కానీ రాహుల్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోవడంతో బుమ్రా నిరాశకు గురయ్యాడు. ఏడో ఓవర్ రెండో బంతికి మార్కరమ్ పొరపాటు చేయగా, బంతి అతని బ్యాట్ అంచుకు తాకి స్లిప్‌లో నిలబడిన కేఎల్ రాహుల్ వైపు దూసుకెళ్లింది. ఇది సాధారణమైన క్యాచ్ అయినప్పటికీ, రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ ఆ క్యాచ్‌ను వదిలేశాడు.
Bumrah and Siraj did all the hard work, and KL Rahul spoiled it. Bumrah looked so disappointed.pic.twitter.com/9ncxNMQeTE https://t.co/46PceO5Qmj
— HARSHIT 🕷 (@I_am_Harshit_17) November 22, 2025
2ND Test. 7.1: Mohammed Siraj to Aiden Markram 4 runs, South Africa 21/0 https://t.co/Wt62QebbHZ #TeamIndia #INDvSA #2ndTest @IDFCfirstbank
— BCCI (@BCCI) November 22, 2025
2ND Test. 7.1: Mohammed Siraj to Aiden Markram 4 runs, South Africa 21/0 https://t.co/Wt62QebbHZ #TeamIndia #INDvSA #2ndTest @IDFCfirstbank
— BCCI (@BCCI) November 22, 2025
KL Rahul, when no body is doing wrong.#IndvsSa pic.twitter.com/hxbkoQb2kC
— Murari Tyamjan🧢 (@Murari_Tyamjan) November 22, 2025
ఈ క్యాచ్‌ను మిస్ చేయడం వల్ల 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న ఎయిడెన్ మార్కరమ్‌కు లైఫ్ లైన్ లభించింది. ఆ సమయంలో సౌత్ ఆఫ్రికా స్కోరు కేవలం 16 పరుగులే. మార్కరమ్ ఈ లైఫ్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. అతను ఓపెనర్ ర్యాన్ రికల్టన్ తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంటే, భారత్‌కు తొలి వికెట్ సాధించడానికి అదనంగా 66 పరుగులు ఖర్చు చేయాల్సి వచ్చింది. రాహుల్ క్యాచ్ పట్టి ఉంటే 16 పరుగులకే తొలి వికెట్ దక్కేది. మార్కరమ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మొత్తం 38 పరుగులు చేసి, జట్టుకు మంచి ఓపెనింగ్ అందించాడు. అతను లైఫ్ లభించిన తర్వాత తన స్కోరుకు మరో 34 పరుగులు జోడించాడు.
కేఎల్ రాహుల్ జారవిడవడంతో.. బుమ్రాతో పాటు సోషల్ మీడియాలో అభిమానులు కూడా రాహుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ క్యాచ్ వదిలేయగానే, కెమెరా యాంగిల్ జస్ప్రీత్ బుమ్రా వైపు తిరిగింది. బుమ్రా తీవ్ర కోపంతో కనిపించినా, ఏమీ మాట్లాడకుండా కేవలం పళ్లు బిగబట్టి, తన రన్-అప్‌కు తిరిగి వెళ్లిపోయాడు. మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులు కేఎల్ రాహుల్‌ను తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. చాలా మంది యూజర్లు “అవసరమైనప్పుడు రాహుల్ ఎప్పుడూ పనికి రాడు” అంటూ విమర్శలు చేశారు. రాహుల్ ఫీల్డింగ్‌ను టార్గెట్ చేస్తూ అనేక మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
