AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kieron Pollard : 6,6,6,6,6,6,6.. 8 బంతుల్లో 7 సిక్సర్లు.. ఎవడు మమ్మీ వీడు.. ఇంత వయలెంటుగా ఉన్నాడు

కీరన్ పొలార్డ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో అతను సిక్సర్ల వర్షం కురిపించి భారీ స్కోరు సాధించాడు. కేవలం 29 బంతుల్లో 224.14 స్ట్రైక్ రేట్‌తో 65 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.

Kieron Pollard : 6,6,6,6,6,6,6.. 8 బంతుల్లో 7 సిక్సర్లు.. ఎవడు మమ్మీ వీడు.. ఇంత వయలెంటుగా ఉన్నాడు
Kieron Pollard
Rakesh
|

Updated on: Sep 02, 2025 | 7:55 AM

Share

Kieron Pollard : కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో కిరాన్ పొలార్డ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో వరుస సిక్సర్లతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అతను కేవలం 29 బంతుల్లో 224.14 స్ట్రైక్ రేట్‌తో 65 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రినిబాగో నైట్ రైడర్స్ (TKR) 179 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగుకు దిగిన ఎస్‌కేఎన్ పాట్రియట్స్ 167 పరుగులకే పరిమితమైంది. దీంతో టీకేఆర్ ఈ మ్యాచ్‌ను 12 పరుగుల తేడాతో గెలుచుకుంది.

8 బంతుల్లో 7 సిక్స్‌లు

కిరాన్ పొలార్డ్ మొదట్లో నెమ్మదిగా ఆడాడు. మొదటి 13 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, ఒకసారి కుదురుకున్న తర్వాత బౌలర్లని చిత్తు చిత్తు చేయడం మొదలుపెట్టాడు. 15వ ఓవర్‌లో నవీన్ బిడేసి బౌలింగ్‌లో మూడవ, నాల్గవ బంతికి సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత ఐదవ బంతిని మిస్ చేసి, ఆరవ బంతికి భారీ సిక్స్ కొట్టాడు.

ఆఫ్గానిస్తాన్ బౌలర్ వకార్ సలాంఖైల్ 16వ ఓవర్‌ను వేయగా, మూడవ బంతికి పొలార్డ్‌కు స్ట్రైక్ వచ్చింది. వకార్ వేసిన ఆ ఓవర్‌లో మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ బంతికి కూడా సిక్సర్లు బాదాడు. ఈ విధంగా అతను ఆడిన చివరి 8 బంతులలో 7 సిక్సర్లు కొట్టాడు. పొలార్డ్ కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్

ట్రినిబాగో నైట్ రైడర్స్ ఓపెనర్లు కోలిన్ మున్రో (17), అలెక్స్ హేల్స్ (7) పెద్దగా రాణించలేకపోయారు. తర్వాత, డారెన్ బ్రావో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే, కిరాన్ పొలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 38 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. దీంతో టీమ్ 180 పరుగుల భారీ టార్గెట్‌ను ఎస్‌కేఎన్ పాట్రియట్స్‌కు అందించింది.

ఎస్‌కేఎన్ పాట్రియట్స్ మంచి ఓపెనింగ్ లభించింది. ఓపెనర్లు మొదటి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఎవిన్ లూయిస్ 25 బంతుల్లో 4 సిక్సర్లతో 42 పరుగులు చేయగా, ఆండ్రే ఫ్లెచర్ 54 బంతుల్లో 67 పరుగులు చేశాడు. కానీ, ఈ ఇద్దరు అవుట్ అయిన తర్వాత జట్టు వెనుకబడి, గెలుపుకు 13 పరుగుల దూరంలో ఆగిపోయింది. ట్రినిబాగో నైట్ రైడర్స్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ 2, నాథన్ ఎడ్వర్డ్ 3 వికెట్లు పడగొట్టారు. పొలార్డ్ తన మెరుపు ఇన్నింగ్స్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?