AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mitchell Starc : ఇదేం షాక్ రా బాబూ.. స్టార్ బౌలర్ సంచలన నిర్ణయం.. ఇక టీ20 మ్యాచ్‌లు ఆడడట!

ఆస్ట్రేలియా గొప్ప బౌలర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్, టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టెస్ట్ క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. స్టార్క్ ఈ నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించాడు. అతను ఆస్ట్రేలియా తరపున మొత్తం 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 2021 టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

Mitchell Starc : ఇదేం షాక్ రా బాబూ.. స్టార్ బౌలర్ సంచలన నిర్ణయం.. ఇక టీ20 మ్యాచ్‌లు ఆడడట!
Mitchell Starc
Rakesh
|

Updated on: Sep 02, 2025 | 8:24 AM

Share

Mitchell Starc : ఆస్ట్రేలియా బెస్ట్ బౌలర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. వన్డే, టెస్ట్ క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. మంగళవారం ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. స్టార్క్ ఆస్ట్రేలియా తరపున 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 2021 టీ20 ప్రపంచ కప్ విజయం కూడా ఉంది. స్టార్క్ చివరిసారిగా 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తరపున ఆడాడు. ఈ టోర్నమెంట్ అమెరికా, వెస్టిండీస్‌లో జరిగింది.

ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత స్టార్క్ మాట్లాడుతూ.. “టెస్ట్ క్రికెట్ ఎప్పుడూ నా మొదటి ప్రాధాన్యత. ఆస్ట్రేలియా తరపున ఆడిన ప్రతి టీ20 మ్యాచ్‌ను ఆస్వాదించాను. ముఖ్యంగా 2021 ప్రపంచ కప్. కేవలం గెలిచామని కాదు, ఆ జట్టుతో కలిసి నడిచిన ప్రయాణం చాలా గొప్పగా ఉంది” అని అన్నాడు.

రాబోయే భారత్ టెస్ట్ సిరీస్, యాషెస్, 2027 వన్డే ప్రపంచ కప్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానని స్టార్క్ చెప్పాడు. వచ్చే ఏడాది 2026 టీ20 ప్రపంచ కప్ ఉన్నందున, తాను రిటైర్ అవ్వడం ద్వారా తన ప్లేసును భర్తీ చేయడానికి యంగ్ ప్లేయర్లకు అవకాశం లభిస్తుందని స్టార్క్ అభిప్రాయపడ్డాడు. “భారత్ టెస్ట్ టూర్, యాషెస్, 2027 వన్డే ప్రపంచ కప్‌లలో ఫిట్‌గా ఉండటానికి, ఇది నాకు బెస్ట్ రూట్ అని భావిస్తున్నాను. ఈ నిర్ణయం బౌలింగ్ గ్రూప్‌కు కూడా టీ20 ప్రపంచ కప్ కోసం సిద్ధం కావడానికి సమయం ఇస్తుంది” అని స్టార్క్ అన్నాడు.

స్టార్క్ గొప్ప బౌలర్: సెలెక్టర్ల ప్రశంసలు

సెలెక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ, స్టార్క్ నిర్ణయంపై స్పందిస్తూ.. “మిచ్ తన టీ20 కెరీర్ గురించి చాలా గర్వపడాలి. అతను 2021 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక సభ్యుడు. తన వికెట్ తీసుకునే సామర్థ్యంతో మ్యాచ్​లను గెలిపించేవాడు” అని ప్రశంసించాడు. ఇంకా మాట్లాడుతూ, “సరైన సమయంలో మేము అతని టీ20 కెరీర్‌ను గుర్తిస్తాం, కానీ ప్రస్తుతం అతను టెస్ట్, వన్డే క్రికెట్​పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాడు” అని బెయిలీ చెప్పాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..