ENG vs IND: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!
మరికొన్ని గంటల్లో ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. శుక్రవారం (జూన్ 20) న జరిగే ఈ మ్యాచ్ కు ముందే భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా కీలక బ్యాటర్ నెనెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా బంతి బలంగా తగిలింది. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతి గట్టిగా తగలడంతో అతని పక్కటెముకకు గాయమైంది.

భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ శుక్రవారం (జూన్ 20) నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మంచి ఆరంభం ఇవ్వాలని భారత జట్టు భావిస్తోంది. గతసారి టీమిండియా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. దీనికి తోడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లోని కఠినమైన పిచ్‌లపై టీమిండియా యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో చూడాి. కాగా ఈ సిరీస్ కోసం 8 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టులోకి వచ్చాడు కరుణ్ నాయర్. ప్రస్తుతం అతని ఫామ్‌ను చూస్తే, ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడని తెలుస్తుంది. కానీ ఈలోగా, కరుణ్ నాయర్ గురించి వినకూడని ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే..శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కు గాయమైనట్లు సమాచారం. బుధవారం, నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతనికి బంతి బలంగా తగిలింది. దీని వల్ల అతను గాయపడ్డాడని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, ఫాస్ట్ బౌలర్ ప్రసీద్ కృష్ణ వేసిన బంతి నాయర్ నేరుగా కడుపుకు తగలడంతో పక్కటెముకకు గాయమైనట్లు తెలుస్తోంది. గాయం తర్వాత తిరిగి బ్యాటింగ్ ప్రారంభించేలోపే కరుణ్ నాయర్ ఇబ్బంది పడ్డాడు. 2017 తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్‌కు ఇది ఒక పెద్ద అవకాశం. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన అతను ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్‌ల కోసం జట్టులోకి వచ్చాడు.
ఎనిమిదేళ్ల తర్వాత వస్తే..
2017 తర్వాత కరుణ్ నాయర్ తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అతను దేశీయ క్రికెట్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. అందుకే అతను ఇప్పుడు భారత జట్టులోకి వచ్చాడు. ఈ సంవత్సరం విదర్భ రంజీ ట్రోఫీని గెలుచుకోవడంలో నాయర్ కీలక పాత్ర పోషించాడు. నాయర్ 2016లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు మొత్తం 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో అతని ప్రదర్శన బాగాలేదు. కానీ దీని తర్వాత, అతను చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండవ భారతీయ బ్యాటర్ గా రికార్డుల కెక్కాడు. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విఫలమయ్యాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




