AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara 2: ‘పంజుర్లి’ హెచ్చరికలు నిజమవుతున్నాయా? ‘కాంతార’ వరుస మరణాలకు కారణమదేనా?

రిషబ్ శెట్టి సినిమా 'కాంతార' షూటింగ్ సమయంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఆర్టిస్టులతో వెళుతోన్న బస్సు బోల్తా పడింది. అలాగే ముగ్గురు ఆర్టిస్టులు ఒక్కొక్కరూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలు కన్నడ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Kantara 2: 'పంజుర్లి' హెచ్చరికలు నిజమవుతున్నాయా? 'కాంతార' వరుస మరణాలకు కారణమదేనా?
Kantara 2 Movie
Basha Shek
|

Updated on: Jun 12, 2025 | 6:47 PM

Share

అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాకు వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇంతకు ముందు ఆ సినిమా ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నవంబర్ 2024. షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తా పడింది. కొల్లూరు సమీపంలోని జడ్కల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఆ తర్వాత, ఆ బృందంలోని ఇద్దరు ఆర్టిస్టులు మరణించారు. ఇప్పుడు, ఆ సినిమా జూనియర్ ఆర్టిస్ట్ విజు వికె గుండెపోటుతో మరణించారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండటం చూస్తుంటే, పంజుర్లి హెచ్చరికలు నిజమవుతున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

మే నెల నుంచి వరుస విషాదాలు..

మే నెల నుంచి ‘కాంతార: చాప్టర్ 1’ బృందంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ (మే)న కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి కన్నుమూశాడు. ‘ఆ రోజు షూటింగ్ జరగలేదు. కాబట్టి, దీనికి ‘కాంతార’ చిత్రానికి మధ్య ఎటువంటి సంబంధం లేదు’ అని కాంతార బృందం క్లారిటీ ఇచ్చినా ఉన్నట్లుండి జూనియర్ ఆర్టిస్ట్ మరణం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇది జరిగిన కొద్దికాలానికే, మే 12న, ‘కాంతార’ కళాకారుడు రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించాడు. ఆయన సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే, చాలా మంది ఆయన మరణాన్ని కూడా అంగీకరించలేకపోయారు. రిషబ్ శెట్టి రాకేష్ అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై కొందరు వివాదం లేవనెత్తారు. ఆ తర్వాత రిషబ్ రాకేష్ కుటుంబ సభ్యులను కలవడంతో వివాదం సద్దుమణిగింది.

ఇప్పుడు మరో విషాదం సంభవించింది. కేరళలోని త్రిసూర్‌కు చెందిన విజు వికె ‘కాంతార’ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. ఆయన అగుంబే సమీపంలోని హోమ్‌స్టేలో ఉంటున్నారు. బుధవారం ( జూన్ 11) రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను తీర్థహళ్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

ఇవి కూడా చదవండి

అసలు ఏం జరిగిందంటే.?

ఇలా కాంతారా టీమ్ లో చోటు చేసుకుంటోన్న వరుస విషాదాలు శాండల్ వుడ్ లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చాలా మంది వీటిని పంజుర్లి దేవుని హెచ్చరికలే నంటూ అభిప్రాయపడుతున్నారు. కాంతార ఛాప్టర్ 1 షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరో రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్‌లో జరిగిన వార్షిక ఉత్సవాలకు వెళ్లాడు. అక్కడ పండగ చివరిలో పంజుర్లి పూనిన పూజారి రిషబ్ తో మాట్లాడుతూ ‘నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు. భారీ కుట్రకు తెర తీశారు. నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు’ అని చెప్పాడు. దీంతో రిషబ్ తో పాటు అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ వారాహి పంజుర్లి హెచ్చరికలే నిజమవుతున్నాయని, అందుకే ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.