AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surekha Vani: పచ్చబొట్టు వేయించుకున్న నటి సురేఖా వాణి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసింది నటి సురేఖా వాణి. ఇప్పుడు ఆమె కూతురు సుప్రిత సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు రెడీ అవుతోంది. తాజాగా సురేఖ వాణి టాటూ వేయించుకుంది. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Surekha Vani: పచ్చబొట్టు వేయించుకున్న నటి సురేఖా వాణి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Surekha Vani
Basha Shek
|

Updated on: Jun 12, 2025 | 3:05 PM

Share

వందలాది సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది సురేఖ వాణి. స్టార్ హీరోలు, హీరోయిన్లకు అక్కగా, వదినగా, అమ్మ పాత్రల్లో అద్భుతంగా నటించింది. అయితే గతంలోలా ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదీ అందాల తార. అయితే ఆ లోటును తీర్చేందుకు సురేఖ కూతురు రెడీ అవుతోంది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తోంది సుప్రిత. అందులో ఒకటి లేచింది మహిళా లోకం. అలాగే బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కలిసి మరో మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటితో పాటు అమ‌రావ‌తికి ఆహ్వానం పేరుతో తెర‌కెక్కుతోన్నమరో హారర్ థ్రిల్లర్ మూవీలోనూ హీరోయిన్ గా కనిపించనుంది సుప్రిత. ‌ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది సురేఖా వాణి. తన కూతురు సుప్రీతా తో కలిసి డ్యాన్స్ రీల్స్ చేస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది సురేఖా వాణి. ఇందులో ఈమె టాటూ వేయించుకుంటూ కనిపించింది. అలాగే కూతురు సుప్రిత కూడా చప్పట్లు కొడుతూ దర్శనమిచ్చింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఆ పెదబాబు అడుగుల వెనకే ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

సురేఖా వాణి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్యాప్షన్ చూసి ఎవరా పెదబాబు అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ తర్వాత ఆమె తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరక్షలను టాటుగా వేయించుకుందని తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీవారిపై పై సురేఖకు ఉన్న భక్తిని చూసి మురిసిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

పచ్చబొట్టు వేయించుకుంటోన్న సురేఖా వాణి.. పక్కన కూతురు సుప్రిత.. వీడియో.

కాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో సురేఖా వాణి నటించిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై క్లారిటీ రాలేదు. దీనిపై మరింత స్పష్టత రావాలంటే జూన్ 27న కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే

కాబోయే హీరోయిన్ సుప్రితతో సురేఖా వాణి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..