Singer Sunitha: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సింగర్ సునీత కూతురు.. ఫొటోస్ చూశారా? అందంలో అమ్మను మించిపోయింది
తేనె కన్నా తీయనైన గొంతుతో సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత. ఎన్నో సినిమాల్లో పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఈ గాన కోకిల మనసు మరింత ఉప్పొంగిపోతోంది. ఎందుకంటే?

ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత. తన అద్భుత గానంతో సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాణిగా వెలుగొందుతోంది. ఎన్నో రివార్డులు, అవార్డులు సునీత తీయనైన గొంతుకు దాసోహమయ్యాయి. సంగీత ప్రపంచంలో ఎంతో మంది యంగ్ సింగర్స్ కు స్ఫూర్తిగా నిలుస్తుందామె. ప్రస్తుతం పలు సింగింగ్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ యువ గాయనీగాయకులకు విలువైన సలహాలు, సూచనలు అందిస్తోంది. వీటన్నటిని పక్కన పెడితే.. సింగర్ సునీత మనసు ఇప్పుడు ఆనందంతో తడిసిముద్దవుతోంది. ఇందుకు కారణం ఆమె కూతురు శ్రేయ. తాజాగా ఆమె అమెరికా న్యూయార్క్ లోని ప్రాట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుషన్ పూర్తిచేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కి సునీత ఫ్యామిలీ అంతా వెళ్లింది. అక్కడ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న శ్రేయతో కలసి సరదాగా గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన సునీత కాస్త ఎమోషనల్ అయ్యింది.
‘మా జీవితంలో ఇదొక మైలురాయి. ఒకప్పుడు స్కెచ్‌బుక్‌లో బొమ్మలు గీస్తూ, వాటికి రంగులు వేసిన నా గారాల పట్టి ఇప్పుడు ప్రాట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇల్లుస్ట్రేటర్‌గా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అయ్యింది. తనను చూస్తుంటే ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఇంత స్ట్రాంగ్‌గా, తెలివైన అమ్మాయిగా ఎదుగుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. నీ సృజనాత్మక శక్తితో మరింత పైకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది సునీత.
శ్రేయ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో సునీత ఫ్యామిలీ..
View this post on Instagram
సునీత గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయ. ఇందులో సునీత భర్త రామ్, కుమారుడు ఆకాశ్ ను కూడా చూడవచ్చు. ఇప్పటికే ఆకాష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సర్కార్ నౌకరి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక శ్రేయ కూడా అమ్మబాటలోనే నడుస్తూ ఒక సినిమాలో పాట కూడా పాడింది..
కూతురు, కుమారుడితో కలిసి సునీత..
View this post on Instagram
సునీత లైఫ్ జర్నీ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








