Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా? అందానికే అసూయ పుట్టించేలా ఉందిగా..
ఈ సూపర్ ఇన్నింగ్స్‌కు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన విరాట్ కోహ్లీ మొదలు వీరేంద్ర సెహ్వాగ్, హార్ధిక్ పాండ్యా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ఇలా సహచర, మాజీ క్రికెటర్లందరూ ఇషాన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఇప్పుడు ఆకాశంలో తేలిపోతున్నాడు. కెరీర్‌లోనే తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మల్చుకుని అరుదైన ఘనతలు సొంతం చేసుకున్న ఈ స్టార్ క్రికెటర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సూపర్ ఇన్నింగ్స్‌కు సాక్షిగా నిలిచిన విరాట్ కోహ్లీ మొదలు వీరేంద్ర సెహ్వాగ్, హార్ధిక్ పాండ్యా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ఇలా సహచర, మాజీ క్రికెటర్లందరూ ఇషాన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీంతో ఈ ముంబై ప్లేయర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఇదిలా ఉంటే ఒక స్పెషల్ పర్సన్ నుంచి ఇషాన్ కిషన్‌కు విషెస్ అందడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మరెవరో కాదు ఇషాన్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న అదితి హుండియా. ఈ సందర్భంగా ఇషాన్‌ను ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న అదితి.. రెడ్ హార్ట్ ఎమోజీతో తన ప్రేమను చాటుకుంది. అంతేకాదు అతని స్పెషల్ ఇన్నింగ్స్‌కు సంబంధించి బీసీసీఐ షేర్ చేసిన పోస్టును కూడా రీషేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఇషాన్, అదితి పేర్లు సామాజికి మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఎవరీ అదితి?
2019 మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్ వరకు చేరుకున్న అదితి.. మోడల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇషాన్ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా, అతని గర్ల్‌ఫ్రెండ్‌గా ఈమె ప్రచారంలో ఉంది. ఈ ఇద్దరు పలుసార్లు జంటగా దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ ప్రాతినిథ్యం వహిస్తోన్న మ్యాచ్‌లకు ముంబై జెర్సీ వేసుకుని పలుమార్లు హాజరైంది. అలాగే ఇన్ స్టాలో ఆమె పెట్టే పోస్టులకు ఇషాన్, ఇషాన్ పెట్టే పోస్టులకు అదితి రిప్లేలు ఇచ్చుకుంటుంటారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే తమ రిలేషన్‌షిప్‌పై ఇషాన్ కానీ, అదితి గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇషాన్ ద్విశతకం బాదడంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తూ అదితి షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.




View this post on Instagram
నెట్టింట భారీ ఫాలోయింగ్..
మోడల్‌గా కెరీర్ కొనసాగిస్తోన్న అదితి గతంలో ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్‌గా కిరీటాన్ని గెల్చుకుంది. మిస్ దివా 2018 మొదటి రన్నరప్‌గా నిలిచింది. మిస్ సుప్రానేషనల్ 2018 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఇక 2019 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచింది. ఈముద్దుగుమ్మకు నెట్టంట భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె తరచూ షేర్ చేసే ఫొటోలకు నెటిజన్లు లైకులు, షేర్ల వర్షం కురిపిస్తుంటారు.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




