AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cristiano Ronaldo: హార్ట్ బ్రేకింగ్ ఫోటో.. వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్‌బాల్ లెజెండ్ రోనాల్డో

పోర్చుగల్‌ లెజెండ్‌ వరల్డ్‌ కప్‌ జర్నీ ట్రాజిక్‌గా ముగిసింది. మొరాకో చేతిలో ఓటమితో రొనాల్డో షాక్‌లోనే ఉండిపోయాడు. గ్రౌండ్‌లోనే కన్నీటిపర్యంతమయ్యాడు.

Cristiano Ronaldo: హార్ట్ బ్రేకింగ్ ఫోటో.. వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్‌బాల్ లెజెండ్ రోనాల్డో
Cristiano Ronaldo Breaks Down
Ram Naramaneni
|

Updated on: Dec 11, 2022 | 2:47 PM

Share

ప్రపంచంలోనే గ్రేటెస్ట్‌ అండ్‌ మోస్ట్ ఫిట్టెస్ట్‌ ప్లేయర్‌ అంటే.. ఎవ్వరైనా చెప్పేది ఒక్కటే పేరు.. క్రిస్టియానో రొనాల్డో. ఈ పోర్చుగల్‌ లెజెండ్రీ ప్లేయర్‌. తన చివరి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడేశాడు. ఫిఫా వరల్డ్‌ కప్‌లో నిన్న మొరాకోతో జరిగిన క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ ఓటమిపాలైంది. ఆ జట్టు ఒక్కగోల్‌ కూడా చేయలేకపోయింది.  ఒక్క ప్రపంచకప్‌ అయినా సాధించాలన్న అతడి కల చెదిరిపోయింది. మొరాకో వంటి జట్టుచేతిలో ఓటమితో.. పోర్చుగల్‌ అవమానకరరీతిలో వైదొలగింది. గత మ్యాచ్‌లో రొనాల్డో బెంచ్‌కే పరిమితం అవ్వగా.. ఈ పోరులో జట్టు కోచ్‌ అతడిని మధ్యలో దించాడు. కాని రొనాల్డో మ్యాజిక్‌ పనిచేయలేదు. మ్యాచ్‌ ముగిసేసరికి 1-0తో మొరాకో గెలవడంతో.. గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. కన్నీరు పెట్టుకున్నాడు. వెక్కివెక్కి ఏడ్చాడు.

దీనికి కారణం ఉంది. పోర్చుగల్‌ ఇప్పటివరకు వరల్డ్‌ కప్‌ గెలవలేదు. గత నాలుగు వరల్డ్‌ కప్స్‌లో రొనాల్డో ఆడినా.. అతడికి జట్టు సరిగా సహకరించలేదు. ఈసారి జట్టు సహకరించినా.. రొనాల్డో ఆడలేకపోయాడు. ఆ మ్యాజిక్‌ చూపించలేకపోయాడు. కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయిన రోనాల్డో పెర్ఫామెన్స్‌ అంతంతమాత్రంగానే నిలిచింది. పోర్చుగల్‌ ఈ వరల్డ్‌ కప్‌లో ఫేవరెట్‌గా నిలిచినా.. రొనాల్డో మ్యాజిక్‌ మాత్రం పనిచేయలేదు. రొనాల్డో మరో ప్రపంచకప్‌ ఆడే అవకాశాలు లేవు.  దీంతో పోర్చుగల్‌ ఓటమి.. ఆతర్వాత అతడి కన్నీరు అభిమానుల మనసునీ పిండేసింది. రొనాల్డో ఏడుస్తుంటే తట్టుకోలేకపోయారు. ఓ వీరుడి ఇంటర్నేషనల్‌ స్టోరీ ఇలా ముగియడం బాధాకరమే.

పోర్చుగల్‌ నుంచి హీరోలు రావొచ్చుగాని… మరో రొనాల్డో రాలేడన్నది వాస్తవం. పోర్చుగల్‌ తరఫున 195 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో 118 గోల్స్‌ కొట్టాడు. కాగా క్రిస్టియానో రొనాల్డోకు సెండాఫ్ చెబుతూ ఫిఫా ట్విటర్‌లో థాంక్యూ అని సందేశాన్ని ఉంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో