IPL ఎవరూ చూడరు.. అంతా PSL చూస్తారు! ఈ ఒక్క మాటతో రెండు చేతులు జేబులో పెట్టుకొని..
ఐపీఎల్ 2025 హోరాహోరీగా సాగుతోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) కూడా ప్రారంభమైంది. ఒక పాకిస్థానీ ఆటగాడు పీఎస్‌ఎల్ బాగా ఆడితే ఐపీఎల్ ను మించిపోతుందని అన్నాడు. కానీ నెటిజన్లు ఈ వ్యాఖ్యను విమర్శిస్తున్నారు. ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రజాదరణను పొందిన లీగ్ అని వారు అంటున్నారు.

ఐపీఎల్ 2025 హోరాహోరీగా సాగుతోంది. క్రికెట్ అభిమానులకు ఫుల్ థ్రిల్ ఇస్తూ.. అసలు సిసలు క్రికెట్ మజాను అందిస్తోంది. ఇప్పటికే ఓ 24 మ్యాచ్‌లు పూర్త అయ్యాయి. ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ మ్యాచ్‌లపైనే ఫోకస్ పెట్టి ఉన్నారు. పైగా ఈ లీగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని లాంటి దిగ్గజాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది స్టార్లుగా ఎదిగిన వాళ్లు ఆడుతున్నారు. ఇవన్నీ కాదు.. అసలు ప్రపంచంలోనే ఐపీఎల్ నంబర్ వన్ టీ20 ఫ్రాంచైజ్ లీగ్‌గా ఉంది. ఐపీఎల్ క్రేజ్, రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే పాకిస్థాన్‌లో కూడా ఒక లీగ్ ఉంది. పీఎస్‌ఎల్.. పాకిస్థాన్ సూపర్ లీగ్. ఈ లీగ్ 2025 సీజన్ నేటి(ఏప్రిల్ 11) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యూనైటెడ్, లాహోర్ కలందర్స్ జట్లు తలపడునున్నాయి.
అయితే.. ఈ లీగ్‌ను ఐపీఎల్‌కు పోటీగా పాకిస్థాన్ తీసుకొచ్చినప్పటికీ.. అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఐపీఎల్‌తో ఏ స్థాయిలో కూడా పోటీ పడలేకపోయింది. అయితే.. తాజాగా ఓ పాకిస్థాన్ ప్లేయర్ ఐపీఎల్, పీఎస్‌ఎల్ గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. మనం బాగా ఆడితే.. ఐపీఎల్‌ను కాదని అంతా పీఎస్‌ఎల్ చూస్తారంటూ ఓ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌నే ఎక్కువ చూస్తారని లెక్కలు చెబుతున్నాయి. కానీ, పీఎస్‌ఎల్‌లోని ప్లేయర్లు బాగా ఆడితే.. అప్పుడు ఐపీఎల్‌ను కాదని, పీఎస్‌ఎల్ చూస్తారని హసన్ అలీ పేర్కొన్నాడు. మీరు బాగా ఆడటం జరగదు, అలాగే ఐపీఎల్‌ను కాదని, పీఎస్‌ఎల్ ఎవరూ చూడరు అంటూ నెటిజన్లు హసన్ అలీని ఆడుకుంటున్నారు. మీరు బాగా ఆడినా.. మేం ఐపీఎలే చూస్తామంటూ కౌంటర్ ఇస్తున్నారు.
కొంతమంది నెటిజన్లు.. ఈ ఒక్క మాటతో రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్లిపోతామంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ లీగ్‌ను 2015లో ప్రారంభించారు. ఇందులో కేవలం 6 టీమ్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి జట్టు గ్రూప్ దశ మ్యాచ్‌లను డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి నాలుగు జట్లు ప్లేఆఫ్‌లకు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు జరిగి తొమ్మిది సీజన్లలో ఇస్లామాబాద్ యునైటెడ్ మూడుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




