IPL 2021, RCB vs PBKS Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. ప్లే ఆఫ్‌కు చేరిన బెంగళూరు

PBKS vs RCB: ఉత్కంఠ మ్యాచులో చివరి వరకు ఆర్‌సీబీ చాలా కష్టపడాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్‌పై 6పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం సాధించింది.

IPL 2021,  RCB vs PBKS Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. ప్లే ఆఫ్‌కు చేరిన బెంగళూరు
Ipl 2021, Rcb Vs Pbks
Follow us
Venkata Chari

|

Updated on: Oct 03, 2021 | 7:32 PM

IPL 2021, RCB vs PBKS Match Result: డబుల్ హెడర్స్‌లో భాగంగా తొలి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ టీం తలపడింది. కీలక మ్యాచులో పంజాబ్ కింగ్స్ తడబడింది. ఆరంభంలో ఓపెనర్స్ అదరగొట్టినా.. చివర్లో తడబడడంతో 6పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 6 వికెట్లు నష్టపోయి 158 పరగులు మాత్రమే చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ టీం ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఎంతో తెలివిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. మొదట్లో నెమ్మదిగా ఆడుతూ.. తరువాత వేగం పెంచి బౌండరీ వర్షం కురిపించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఘనమైన ఆరంభాన్ని అందించారు. 10.5 ఓవర్‌లో అహ్మద్ వేసిన బంతిని షాట్ ఆడబోయిన కేఎల్ రాహుల్(39 పరుగులు, 35 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు) హర్షల్ పటేల్ అద్భుత క్యాచ్‌కు దొరికిపోయాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (3) త్వరగా పెవిలియన్ చేరాడు. అయితే మక్రాం(20) తో కలిసి మయాంక్ మరోసారి మంచి భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. అయితే 15.2 ఓవర్లో మయాంక్ అగర్వాల్(57 పరుగులు, 42 బంతులు, 6ఫోర్లు, 2 సిక్సులు) చాహల్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ్ చేరాడు. దీంతో పంజాబ్ కింగ్స్ విజయం వైపు నుంచి ఓటమి దశకు చేరుకోవడంలో అడుగులు పడ్డాయి. మయాంక్ ఔటయ్యాక వెంటనే మరో రెండు వికెట్లు పడ్డాయి. సర్ఫరాజ్ ఖాన్(0), మక్రాం(20) త్వరగానే పెవిలియన్ చేరారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఆర్‌సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ((25 పరుగులు, 24 బంతులు, 2 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (40 పరుగులు, 38 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. 9.4 ఓవర్లో హెన్రిక్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌల్డ్ అయ్యి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆవెంటనే క్రీజులోకి వచ్చిన డానియల్ క్రిస్టియన్ (0) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే పడిక్కల్ కూడా హెన్రిక్స్ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 11.4 ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఏబీ డివిలియర్స్ ఆర్‌సీబీకి కీలకమైన 73 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, 18.2 ఓవర్లో డివిలియర్ (23) రన్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఇక మ్యాక్స్‌వెల్ ఆర్‌సీబీ తరుపున కీలక ఇన్నింగ్స్ ఆడి, భారీ స్కోర్ చేసేందుకు సహాయపడ్డాడు. కేవలం 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సుల సహాయంతో 170కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 57 పరుగులు చేశాడు. మంచి ఊపు మీదున్న మ్యాక్స్‌వెల్ చివరి ఓవర్‌లో షమీ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అనంతరం ఆర్‌సీబీ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. అహ్మద్, గార్టన్ వరుస బంతుల్లో ఔటయ్యారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హెన్రిక్స్, షమీ తలో 3 వికెట్లు పడగొట్టాడు.

Also Read: RCB vs PBKS, IPL 2021: పంజాబ్ టార్గెట్ 165.. మ్యాక్స్‌వెల్ అర్థ శతకం.. చెరో 3 వికెట్లతో ఆర్‌సీబీ నడ్డి విరిచిన హెన్రిక్స్, షమీ

RCB vs PBKS Highlights, IPL 2021: చివర్లో తడబడిన పంజాబ్.. 6 పరుగుల తేడాతో గెలిచి, ప్లే ఆఫ్‌కు చేరిన బెంగళూరు

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?