RCB vs PBKS Highlights, IPL 2021: చివర్లో తడబడిన పంజాబ్.. 6 పరుగుల తేడాతో గెలిచి, ప్లే ఆఫ్‌కు చేరిన బెంగళూరు

Venkata Chari

|

Updated on: Oct 03, 2021 | 7:21 PM

PBKS vs RCB Highlights: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

RCB vs PBKS Highlights, IPL 2021: చివర్లో తడబడిన పంజాబ్.. 6 పరుగుల తేడాతో గెలిచి, ప్లే ఆఫ్‌కు చేరిన బెంగళూరు
Ipl 2021, Rcb Vs Pbks

RCB vs PBKS Highlights, IPL 2021: డబుల్ హెడర్స్‌లో భాగంగా తొలి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ టీం తలపడింది. కీలక మ్యాచులో పంజాబ్ కింగ్స్ తడబడింది. ఆరంభంలో ఓపెనర్స్ అదరగొట్టినా.. చివర్లో తడబడడంతో 6పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం సాధించింది. డబుల్ హెడర్స్‌లో భాగంగా తొలి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ టీం తలపడుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఐపీఎల్ 2021లో ఆదివారం డబుల్ హెడర్స్‌ మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తరమైన పోరు జరుగనుంది. ప్లేఆఫ్ పరంగా ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలు సాధించింది. ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు 12 మ్యాచ్‌ల్లో ఐదు మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్ పంజాబ్‌కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచులో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి.

ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య మొత్తం 27 మ్యాచులు జరిగాయి. ఇందులో పంజాబ్ 15 మ్యాచులో గెలిచి, కోహ్లీ సేనపై ఆధిక్యంలో నిలిచింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌లు గెలిచింది.

ప్లేయింగ్ ఎలెవన్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/కీపర్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, హర్‌ప్రీత్ బ్రార్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 03 Oct 2021 07:19 PM (IST)

    కోహ్లీసేనదే విజయం

    ఉత్కంఠ మ్యాచులో చివరి వరకు ఆర్‌సీబీ చాలా కష్టపడాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్‌పై 6పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం సాధించింది.

  • 03 Oct 2021 07:07 PM (IST)

    18 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 138/5

    18 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ టీం 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ విజయానికి 12 బంతుల్లో 27 పరుగులు కావాల్సి ఉంది.

  • 03 Oct 2021 06:53 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్

    మయాంక్ (57 పరుగులు, 42 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. పంజాబ్ కింగ్స్ విజయానికి 26 బంతుల్లో 44 పరుగులు కావాల్సి ఉంది. 15.4 ఓవర్లకు టీం స్కోర్ 121/3

  • 03 Oct 2021 06:45 PM (IST)

    14 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 102/2

    14 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ టీం 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ 52, మక్రాం 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ విజయానికి 36 బంతుల్లో 63 పరుగులు కావాల్సి ఉంది.

  • 03 Oct 2021 06:37 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్

    పూరన్ (3) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం రెండో వికెట్ కోల్పోయింది. పంజాబ్ కింగ్స్ విజయానికి 43 బంతుల్లో 66 పరుగులు కావాల్సి ఉంది. 12.5 ఓవర్లకు టీం స్కోర్ 99/2

  • 03 Oct 2021 06:27 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్

    రాహుల్(39 పరుగులు, 35 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఓపెనర్ల కీలకమైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 10.5 ఓవర్లకు టీం స్కోర్ 91/1

  • 03 Oct 2021 06:20 PM (IST)

    9 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 73/0

    9 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ టీం 73 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 37, మయాంక్ 30 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 03 Oct 2021 06:03 PM (IST)

    6 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 49/0

    6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ టీం 49 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 26, మయాంక్ 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 03 Oct 2021 05:46 PM (IST)

    3 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 19/0

    3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ టీం 19 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 14, మయాంక్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 03 Oct 2021 05:36 PM (IST)

    మొదలైన పంజాబ్ ఛేజింగ్

    165 పరుగుల లక్ష్యంతో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగారు.

  • 03 Oct 2021 05:18 PM (IST)

    పంజాబ్ టార్గెట్ 165

    టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

  • 03 Oct 2021 05:03 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూరు

    డివిలియర్స్ (23) రూపంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నాలుగో వికెట్ కోల్పోయింది. 18.2 ఓవర్లకు టీం స్కోర్ 146/4

  • 03 Oct 2021 04:50 PM (IST)

    16 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 115/3

    16 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మూడు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. క్రీజులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 37, డివిలియర్స్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 03 Oct 2021 04:45 PM (IST)

    15 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 109/3

    15 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. క్రీజులోగ్లెన్ మ్యాక్స్‌వెల్ 34, డివిలియర్స్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మ్యాక్స్‌వెల్ 15వ ఓవర్‌లో వరుసగా రెండు బంతులను సిక్స్‌లుగా మలిచాడు.

  • 03 Oct 2021 04:37 PM (IST)

    13 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 89/3

    13 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మూడు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. క్రీజులోగ్లెన్ మ్యాక్స్‌వెల్ 18, డివిలియర్స్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. క్రీజులోకి వచ్చిన వెంటనే మ్యాక్స్‌వెల్ 13వ ఓవర్ వేసిన హర్‌ప్రీత్‌పై దాడి చేసి 2 సిక్సులు బాదేశాడు.

  • 03 Oct 2021 04:31 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు

    పడిక్కల్(40 పరుగులు, 38 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిక్స్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 11.4 ఓవర్లకు టీం స్కోర్ 73/3

  • 03 Oct 2021 04:24 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు

    క్రిస్టియన్ రూపంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వరుస బంతుల్లో రెండో వికెట్ కోల్పోయింది. హెన్రిక్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌల్డ్ కాగా, క్రిస్టియన్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 9.5 ఓవర్లకు టీం స్కోర్ 68/2

  • 03 Oct 2021 04:21 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు

    విరాట్ కోహ్లీ(25 పరుగులు, 24 బంతులు, 2 ఫోర్లు, సిక్స్) రూపంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తొలి వికెట్ కోల్పోయింది. హెన్రిక్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌల్డయ్యాడు. 9.4 ఓవర్లకు టీం స్కోర్ 68/1

  • 03 Oct 2021 04:17 PM (IST)

    9 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 67/0

    9 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 67 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 25, పడిక్కల్ 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 9 ఓవర్ వేసిన హర్‌ప్రీత్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ 5వ బాల్‌ను సిక్స్‌గా మలిచాడు.

  • 03 Oct 2021 04:00 PM (IST)

    6 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 55/0

    6 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 55 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 18, పడిక్కల్ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 6 ఓవర్ వేసిన అర్షదీప్ బౌలింగ్‌లో పడిక్కల్ సిక్స్, ఫోర్‌ బాదేశాడు.

  • 03 Oct 2021 03:45 PM (IST)

    3 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 24/0

    3 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 24 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 9, పడిక్కల్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 3 ఓవర్ వేసిన అర్షదీప్ బౌలింగ్‌లో పడిక్కల్ తొలి రెండు బంతులను సిక్స్, ఫోర్‌గా మలిచాడు.

  • 03 Oct 2021 03:26 PM (IST)

    RCB vs PBKS: హెడ్ టూ హెడ్

    ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య మొత్తం 27 మ్యాచులు జరిగాయి. ఇందులో పంజాబ్ 15 మ్యాచులో గెలిచి, కోహ్లీ సేనపై ఆధిక్యంలో నిలిచింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌లు గెలిచింది.

  • 03 Oct 2021 03:25 PM (IST)

    ఈ సీజన్‌లో షార్జాలో జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు

    తొలుత బ్యాటింగ్‌ చేసిన టీంలు గెలిచిన మ్యాచులు -1 ఛేజింగ్ చేసిన టీంలు గెలిచిన మ్యాచులు – 4

  • 03 Oct 2021 03:09 PM (IST)

    పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్

    పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/కీపర్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, హర్‌ప్రీత్ బ్రార్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

  • 03 Oct 2021 03:06 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

  • 03 Oct 2021 03:04 PM (IST)

    టాస్ గెలిచిన కోహ్లీసేన

    డబుల్ హెడర్ మ్యాచులో భాగంగా తొలి మ్యాచ్ బెంగళురు వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీంల మధ్య జరగనుంది. దీనిలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ టీం తొలుత బౌలింగ్ చేయనుంది.

  • 03 Oct 2021 02:37 PM (IST)

    RCB vs PBKS: కోహ్లీతో రాహుల్ పోరాటానికి అంతా సిద్ధం

Published On - Oct 03,2021 2:34 PM

Follow us
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!