KKR vs SRH Highlights, IPL 2021: లో స్కోరింగ్‌లోనూ కష్టపడి గెలిచిన కోల్‌కతా.. 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి
SRH vs KKR Highlights in Telugu: కోల్‌కతా టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత లక్ష్యాన్ని చివరి ఓవర్ వరకు తీసుకెళ్లిన కేకేఆర్ టీం.. 4 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.
SRH vs KKR Highlights in Telugu: అత్యల్ప స్కోరింగ్ మ్యాచులో కోల్‌కతా టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత లక్ష్యాన్ని చివరి ఓవర్ వరకు పోరాటం చేసి 4 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో కోల్‌కతా టీం ప్లేఆఫ్ ఆశలను మరింత పదిల పరుచుకుంది. ఐపీఎల్ 2021 లో ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో కోహ్లీసేన 6 పరుగులతో విజయం సాధించింద. ఇక రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంల మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ టీం తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు సాధించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 116 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. మరోవైపు కేకేఆర్ టీంకు మాత్రం చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో కోల్‌కతా టీం అద్భుతంగా ఆడింది. బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ టీం ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
కోల్‌కతా జట్టు 10 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. యూఏఈలో తిరిగి ప్రారంభమైన ఐపీఎల్ రెండో దశలో సన్‌రైజర్స్ టీం ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. సన్‌రైజర్స్ వరుసగా ఐదు పరాజయాల తర్వాత రాజస్థాన్ రాయల్స్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 20 మ్యాచులు జరిగాయి. ఇందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 13 విజయాలు సాధించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం కేవలం 7 విజయాలు మాత్రమే సాధించింది. చివరిసారిగా ఈ రెండు జట్లు చెన్నైలో పోటీపడ్డాయి. ఈ మ్యాచులో కోల్‌కతా టీం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో నితీష్ రాణా 56 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ప్లేయింగ్ ఎలెవన్ : కోల్‌కతా నైట్ రైడర్స్: శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి సన్‌రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్
LIVE Cricket Score & Updates
-
కోల్‌కతాదే విజయం
కోల్‌కతా టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత లక్ష్యాన్ని చివరి ఓవర్ వరకు తీసుకెళ్లిన కేకేఆర్ టీం.. 4 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.
-
నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
రాణా (25 పరుగులు, 33 బంతులు, 3 ఫోర్లు) రూపంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 17.6 ఓవర్లకు స్కోర్ 106/4
-
-
మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
శుభ్మన్ గిల్ (57 పరుగులు, 51 బంతులు, 10 ఫోర్లు) రూపంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. కౌల్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 16.3 ఓవర్లకు స్కోర్ 93/3
-
ఐపీఎల్ 2021లో తొలి అర్థ శతకం చేసిన శుభ‌్మన్ గిల్
కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్ 43 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో ఐపీఎల్ 2021లో తన తొలి అర్థ శతకాన్ని నమోదు చేశాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ కోల్‌కతా విజయానికి చేరువ చేస్తున్నాడు.
-
13 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 72/2
13 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ 48, నితీష్ రాణా 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. శుభ్మన్ గిల్ వరుసగా రెండు ఓవర్లలో నాలు ఫోర్లు బాదేశాడు. దీంతో తన అర్ధ సెంచరీకి మరో రెండు పరుగుల దూరంలో నిలిచాడు.
-
-
11 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 51/2
11 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ 29, నితీష్ రాణా 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
8 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 40/2
8 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ 24, నితీష్ రాణా 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
త్రిపాఠి (7) రూపంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. రషీద్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6.4 ఓవర్లకు స్కోర్ 38/2
-
తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
వెంకటేష్ అయ్యర్ (8) రూపంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4.4 ఓవర్లకు స్కోర్ 23/1
-
2 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 9/0
2 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 9 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 2, శుభ్మన్ గిల్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
8వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్
రషీద్ (8 పరుగులు) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. శివం మావి బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 18.2 ఓవర్లకు స్కోర్ 103/8
-
ఏడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
అబ్దుల్ సమద్ (25పరుగులు, 18 బంతులు, 3 సిక్సులు) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఏడో వికెట్‌ను కోల్పోయింది. సౌతి బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 17.2 ఓవర్లకు స్కోర్ 95/7
-
ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
హోల్డర్ (2) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 16.1 ఓవర్లకు స్కోర్ 80/6
-
16 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 80/5
16 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం ఐదు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో సమద్ 12, హోల్డర్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
గార్గ్ (21) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 14.2 ఓవర్లకు స్కోర్ 70/5
-
14 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 70/4
14 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో గార్గ్ 21, సమద్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
11 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 53/4
11 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం నాలుగు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో గార్గ్ 9, అబ్దుల్ సమద్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
అభిషేక్ శర్మ (6 పరుగులు) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. షకీబ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 10.1 ఓవర్లకు స్కోర్ 51/4
-
మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
విలియమ్సన్ (26 పరుగులు, 21 బంతులు, 4 ఫోర్లు) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. షకీబ్ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. 6.5 ఓవర్లకు స్కోర్ 38/3
-
6 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 35/2
ఆరు ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్ 24, గార్గ్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 6వ ఓవర్‌లో విలియమ్సన్ కేకేఆర్ బౌలర్ శివం మావిపై విరుచకపడ్డాడు. ఆ ఓవర్‌లో 4 ఫోర్లతో మొత్తం 18 పరుగులు రాబట్టాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
జాన్సన్ రాయ్ (10) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. శివం మావి బౌలింగ్‌లో సౌతీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 3.4 ఓవర్లకు స్కోర్ 16/2
-
3 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 14/1
మూడు ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో రాయ్ 10, విలియమ్సన్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 3వ ఓవర్‌లో జాన్సన్ రాయ్ వరుసగా రెండు ఫోర్లు బాదేశాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
సాహా(0) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తొలి ఓవర్‌లోనే మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సౌతీ వేసిన బంతిని తప్పుగా అర్థం చేసుకున్న సాహా ఎల్బీగా వెనుదిరిగాడు.
-
KKR vs SRH: టాస్ గెలిచిన హైదరాబాద్
డబుల్ హెడర్స్‌లో భాగంగా దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం తొలుత బౌలింగ్ వేయనుంది.
-
KKR vs SRH: హెడ్ టూ హెడ్
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 20 మ్యాచులు జరిగాయి. ఇందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 13 విజయాలు సాధించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం కేవలం 7 విజయాలు మాత్రమే సాధించింది.
-
మరో కీలక పోరుకు దుబాయ్ సిద్ధం
Meanwhile in Dubai, we are gearing up for a fascinating contest between KKR ? and SRH ?
Who’s winning this one ?#VIVOIPL | #KKRvSRH pic.twitter.com/Ldh2ALJlHe
— IndianPremierLeague (@IPL) October 3, 2021
Published On - Oct 03,2021 6:39 PM