IPL 2021, RCB vs DC Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న భరత్, మ్యాక్స్‌వెల్

RCB vs DC: చివరో ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో బెంగళూరు టీం విజయం సాధిచింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది.

IPL 2021, RCB vs DC Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న భరత్, మ్యాక్స్‌వెల్
Ipl 2021, Rcb Vs Dc
Follow us
Venkata Chari

|

Updated on: Oct 08, 2021 | 11:25 PM

DC vs RCB, IPL 2021: ఐపీఎల్‌ 2021 రెండో దశలో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడ్డాయి. చివరో ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో బెంగళూరు టీం విజయం సాధిచింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. చెన్నైతో పాటు బెంగళూరు కూడా 18 పాయింట్లతో సమానంగా నిలిచింది. కానీ, నెగిటివ్ రన్‌రేట్‌ ఉండడంతో కోహ్లీసేన మూడో స్థానంలో నిలిచింది.

165 పరుగుల స్కోర్‌ను ఛేజింగ్ చేసేందుకు ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(4), పడిక్కల్(0) త్వరగా పెవిలియన్ చేరాడు. దీంతో తొలి రెండు ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. నార్ట్జ్ బౌలింగ్‌లో పడిక్కల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన వెంటనే విరాట్ కోహ్లీ కూడా ఆయన బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం ఏబీ డివిలియర్స్ ఉన్న కొద్దిసేపు ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 26 పరుగులు చేసిన ఏబీడీ అక్షర్ బౌలింగ్‌లో శ్రేయాస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆర్‌సీబీ కీపర్ శ్రీకర్ భరత్ (78 పరుగులు, 52 బంతులు, 3 ఫోర్లు, 4 సిక్సులు), గ్లెన్ మ్యాక్స్‌వెల్(51 పరుగులు, 33 బంతులు, 8 ఫోర్లు) లు ఇద్దరూ కీలకమైన ఇన్నింగ్ ఆడారు. 100కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆర్‌సీబీని గెలిపించారు. ఢిల్లీ బౌలర్లలో నార్ట్జ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.

ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ముందు 165 పరుగులు టార్గెట్‌ను ఉంచారు. ఢిల్లీ ఓపెనర్లు అద్భుత ఓపెనింగ్ భాగస్వామ్యంతో ఢిల్లీ తొలి పవర్ ప్లేలో బెంగళూరుపై ఆధిపత్యం చూపించారు. అయితే భారీ ఇన్నింగ్స్‌ కోసం ఆడుతున్న క్రమంలో హాప్ సెంచరీకి ధావన్ (43 పరుగులు, 35 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 10.1 ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయిన ధావన్, క్రిష్టియన్‌ చేతికి చిక్కాడు. దీంతో 88 పరుగుల ఓపెనర్లు భాగస్వామ్యానికి తెరపడింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి పృథ్వీ షా (48 పరుగులు, 31 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) బౌండరీల వర్షం కురిపించారు. కానీ, చాహల్ వేసిన 11.2 ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయిన షా.. జార్జ్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే రిషబ్ పంత్ (10) కూడా క్రిస్టియన్ వేసిన 12.4 ఓవర్‌లో ఫుల్ షాట్ ఆడబోయి కీపర్ శ్రీకర్ భరత్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.

అనంతరం శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హిట్‌మెయిర్ మరోసారి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డులో పరుగులు పెంచేందుకు ట్రై చేశారు. కానీ, ఈ జంటను సిరాజ్ విడదీశాడు. శ్రేయాస్ అయ్యర్ (18 పరుగులు, 18 బంతులు, 1 ఫోర్) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ వేసిన 17.4 ఓవర్‌లో క్రిస్టియన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అనంతరం షిమ్రాన్ హెట్‌మెయిర్(29 పరుగులు, 22 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) ఇన్నింగ్స్ చివరి బాల్‌కు పెవిలియన్ చేరాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో సిరాజ్, చాహల్, హర్షల్ పటేల్, క్రిస్టియన్ తలో వికెట్‌ పడగొట్టారు.

ప్లేయింగ్ ఎలెవన్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, కేఎస్ భరత్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డాన్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్ & కీపర్), స్టీవ్ స్మిత్, అక్సర్ పటేల్, షిమ్రాన్ హెట్‌మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే

Also Read: IPL 2021 SRH vs MI: విధ్వంసం సృష్టించిన ముంబయి బ్యాట్స్‌మెన్‌.. ప్లేఆఫ్‌ ఆశలు సజీవమేనా.? 235 పరుగుల భారీ స్కోర్‌..

RCB vs DC, IPL 2021: కోహ్లీసేన టార్గెట్ 165.. ఆకట్టుకున్న ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!