RCB vs DC, IPL 2021: కోహ్లీసేన టార్గెట్ 165.. ఆకట్టుకున్న ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్
RCB vs DC: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ముందు 165 పరుగులు టార్గెట్‌ను ఉంచారు.
DC vs RCB, IPL 2021: ఐపీఎల్ 2021 రెండో దశలో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ముందు 165 పరుగులు టార్గెట్‌ను ఉంచారు. ఢిల్లీ ఓపెనర్లు అద్భుత ఓపెనింగ్ భాగస్వామ్యంతో ఢిల్లీ తొలి పవర్ ప్లేలో బెంగళూరుపై ఆధిపత్యం చూపించారు. అయితే భారీ ఇన్నింగ్స్ కోసం ఆడుతున్న క్రమంలో హాప్ సెంచరీకి ధావన్ (43 పరుగులు, 35 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 10.1 ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయిన ధావన్, క్రిష్టియన్ చేతికి చిక్కాడు. దీంతో 88 పరుగుల ఓపెనర్లు భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి పృథ్వీ షా (48 పరుగులు, 31 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) బౌండరీల వర్షం కురిపించారు. కానీ, చాహల్ వేసిన 11.2 ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయిన షా.. జార్జ్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే రిషబ్ పంత్ (10) కూడా క్రిస్టియన్ వేసిన 12.4 ఓవర్‌లో ఫుల్ షాట్ ఆడబోయి కీపర్ శ్రీకర్ భరత్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
అనంతరం శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హిట్‌మెయిర్ మరోసారి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డులో పరుగులు పెంచేందుకు ట్రై చేశారు. కానీ, ఈ జంటను సిరాజ్ విడదీశాడు. శ్రేయాస్ అయ్యర్ (18 పరుగులు, 18 బంతులు, 1 ఫోర్) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ వేసిన 17.4 ఓవర్‌లో క్రిస్టియన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అనంతరం షిమ్రాన్ హెట్‌మెయిర్(29 పరుగులు, 22 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) ఇన్నింగ్స్ చివరి బాల్‌కు పెవిలియన్ చేరాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో సిరాజ్, చాహల్, హర్షల్ పటేల్, క్రిస్టియన్ తలో వికెట్ పడగొట్టారు.
ప్లేయింగ్ ఎలెవన్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, కేఎస్ భరత్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డాన్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్ & కీపర్), స్టీవ్ స్మిత్, అక్సర్ పటేల్, షిమ్రాన్ హెట్‌మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే
Innings Break!
Siraj brings the innings to a close by getting the scalp of Hetmyer.#DelhiCapitals post a total of 164/5 on the board. #RCB chase coming up shortly. Stay tuned!
Scorecard – https://t.co/z5hns662XQ #RCBvDC #VIVOIPL pic.twitter.com/8909xKDPiU
— IndianPremierLeague (@IPL) October 8, 2021
Also Read: IPL 2021 SRH vs MI Match Live: దండి కొడుతున్న సూర్య కుమార్ యాదవ్.. వరుస బౌండరీలతో..