IPL 2021 SRH vs MI Match Highlights: సన్ రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
Sunrisers Hyderabad vs Mumbai Indians Highlights: ఐపీఎల్ 2021లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఒక జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుండగా మరో జట్టుకు మాత్రం నామ మాత్రమేనని చెప్పాలి...
Sunrisers Hyderabad vs Mumbai Indians Highlights: ఐపీఎల్ 2021లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఒక జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుండగా మరో జట్టుకు మాత్రం నామ మాత్రమేనని చెప్పాలి. హైదరాబాద్, ముంబయిలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబయి విజయం అత్యంత అవసరం కానుంది. ఇక హైదరాబాద్ ఎలాగే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది కాబట్టి ఈ మ్యాచ్ కేవలం టోర్నీ నుంచి విజయంతో వెళ్లడానికి మాత్రమే ఉపయోగపడనుంది. మరి డూ ఆర్ డై అన్నట్లు సాగనున్న ఈ మ్యాచ్‌లో ముంబయి గెలుస్తుందా.? గెలిచి ప్లే ఆఫ్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంటుందా.? అన్న దానిపై అందరి దృష్టి పడింది.
ముందుగా టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. రోహిత్ క్రీజులో కుదురుకుంటున్న సమయంలోనే రషీద్ ఖాన్ ఓవర్లో మహమ్మద్ నబి చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు.
32 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్స్‌లు, 11ఫోర్లు ఉన్నాయి. ఉమ్రాన్ మాలిక్ వేసిన పదో ఓవర్లో ఇషాన్ దూకుడుకు తెరపడింది. కీపర్ వృద్దిమాన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ చివరి వరకు సిక్సులు, ఫోర్లతో అలరించాడు. 40 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్స్‌లు 13 ఫోర్లు ఉన్నాయి. మిగతావారు పెద్దగా రాణించలేదు. దీంతో ముంబై 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ తలో రెండు, ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభిన హైదరాబాద్‌కి ఓపెనర్లు జాసన్ రాయ్, అభిషేక్ శర్మ శుభారంభానిచ్చారు. జాసన్ రాయ్ 34 పరుగులు, అభిషేక్ శర్మ 33 పరుగులతో ఆకట్టుకున్నారు. తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే చివరి వరకు పోరాడాడు. ఈ క్రమంలో 41 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 2సిక్స్‌లు ఉన్నాయి. మిగతా బ్యాట్స్‌మెన్లలో ప్రియమ్ గార్గ్ 29 పరుగులు మినహాయించి పెద్దగా ఎవరు రాణించలేదు. దీంతో హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా 2, నాథన్ కౌల్టర్ 2, జేమ్స్ నీషమ్ 2 వికెట్ల చొప్పున సాధించారు.
ఇరు జట్ల ప్లేయర్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్:
మనీష్ పాండే (కెప్టెన్), జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్
ముంబయి ఇండియన్స్:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్ -నైల్, పియూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
LIVE Cricket Score & Updates
-
సన్ రైజర్స్‌పై ముంబై ఘన విజయం
సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 20 ఓవర్లలో కేవలం 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. మనీశ్ పాండే చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింంది.
-
ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్
సన్ రైజర్స్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహ 9 పరుగులు ఔటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విజయానికి 7 బంతుల్లో 54 పరుగులు చేయాలి.
-
-
ఏడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్
సన్ రైజర్స్ ఏడో వికెట్ కోల్పోయింది. రషీద్‌ఖాన్ 9 పరుగులు ఔటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. విజయానికి 15 బంతుల్లో 59 పరుగులు చేయాలి.
-
దూకుడుగా ఆడుతున్న మనీశ్ పాండే
వికెట్లు పడుతున్నప్పటికీ మనీశ్ పాండే దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 పరుగులతో ఆడుతున్నాడు. అతనికి రషీద్ ఖాన్ సహకరించే ప్రయత్నం చేస్తున్నాడు.
-
ఆరో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది. జాసన్ హోల్డర్ 1పరుగుకే ఔటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. విజయానికి 23 బంతుల్లో 70 పరుగులు చేయాలి.
-
-
10 ఓవర్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ 105/4
10 ఓవర్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో మనీశ్ పాండే 23 పరుగులు ప్రియమ్ గార్గ్ 2 పరుగుతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 61 బంతుల్లో 132 పరుగులు చేయాల్సిఉంది.
-
10 ఓవర్లకు బెంగుళూరు 61/3
10 ఓవర్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో శ్రీకర్ భరత్ 27 పరుగులు, గ్లెన్ మాక్స్‌వెల్ 1 పరుగుతో ఆడుతున్నారు. విజయానికి 59 బంతుల్లో 103 పరుగులు చేయాలి.
-
ఆచితూచి ఆడుతోన్న హైదరాబాద్..
236 పరుగుల భారీ లక్ష్యంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ ఆచితూచి ఆడుతోంది. ఈ క్రమంలోనే నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 47 పరుగులు సాధించింది.
-
సన్ రైజర్స్ లక్ష్యం ఏంతంటే..
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి అద్భుత ఆటతీరును కనబరించింది. భారీ స్కోరు లక్ష్యంగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబయి మొదటి నుంచి జట్టు స్కోరును జట్ స్పీడ్‌తో తీసుకెళ్లింది. నిర్ణీత 20 ఓవర్‌లలో 9 వికెట్లు కోల్పోయి 235 పరుగులు సాధించింది.
-
చెలరేగి ఆడుతోన్న సూర్య కుమార్..
జట్టు స్కోరును కనీసం 250 చేర్చాలనే లక్ష్యంతో సూపర్ బ్యాటింగ్ చేస్తోన్న సూర్య కుమార్ యాదవ్ చాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు. ఈ క్రమంలోనే 17 ఓవర్‌లో వరుసగా ఒక ఫోర్, సిక్స్ బాదాడు. ఈ క్రమంలో సూర్య కేవలం 31 బంతుల్లోనే 70 పరగులు సాధించాడు. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసే సమయానికి ముంబయి 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
మరో వికెట్ గాన్..
జట్టు స్కోరు పెంచే క్రమంలోనే జోరుగా ఆడిన నాథన్ కౌల్టర్ నైల్ అవుట్ అయ్యాడు. హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి నబీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
-
సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ..
ముంబయికి భారీ స్కోర్ అవసరమైన తరుణంలో సూర్యకుమార్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ బాధ్యతను స్వీకరిస్తూ జట్టు స్కోరును పెంచేశాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో జట్టు స్కోర్ 200 మార్కును తాకింది. 17 ఓవర్లు ముగిసే సమయానికి ముంబయి 6 వికెట్ల నష్టానికి 204 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ (59), నాథన్ కౌల్టర్ -నైల్ (01) పరుగులతో కొనసాగుతున్నారు.
-
మరో వికెట్ కోల్పోయిన ముంబయి..
కృనల్ పాండ్యా రూపంలో ముంబయి ఇండియన్స్ మరో వికెట్‌ను కోల్పోయింది. రషీద్ ఖాన్ విసిరిన బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన కృనల్ పాండ్యా నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
-
వరుస వికెట్లు కోల్పోయిన ముంబయి..
భారీగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబయికి అభిషేక్ శర్మ రూపంలో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. జేమ్స్ నిషమ్, పోలార్డ్ వెంటనే వెంటనే అవుట్ అయ్యారు.
-
సెంచరీ మిస్ చేసుకున్న ఇషాన్..
ముంబయి స్కోరును జట్ స్పీడుతో తీసుకెళ్లిన ఇషాన్ కిషన్ ఎట్టకేలకు అవుటయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతికి భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించిన ఇషాన్.. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన ముంబయి.. పాండ్యే అవుట్.
ముంబయి రెండో వికెట్‌ను కోల్పోయింది. జేసన్ హోల్డర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించిన హార్ధిక్ పాండ్యా జేసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. పాండ్యా 8 బంతుల్లో 10 పరుగులు సాధించాడు.
-
జట్ స్పీడు వేగంతో ముంబయి స్కోర్ బోర్డ్..
ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ముంబయి రాణిస్తోంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి ముంబయి 1 వికెట్‌ను కోల్పోయి 112 పరుగులు సాధించింది. ఇక ఇందులో సుమారు 80 శాతానికి పైగా అంటే 83 పరుగులు ఇషాన్ సాధించినవే కావడం విశేషం. ప్రస్తుతం క్రీజులో పాండ్యా (10), ఇషాన్ (83) పరుగులతో కొనసాగుతున్నాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన ముంబయి.. రోహిత్ శర్మ అవుట్.
ముంబయి జోరుకు తొలిసారి బ్రేక్ పడింది. రోహిత్ శర్మ నబి బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. రషీద్ అద్భుతమైన క్యాచ్‌తో ముంబయి జోరుకు ఒక చిన్న బ్రేక్ వేశాడు.
-
ఇషాన్ జోరుకు హైదరాబాద్ బౌలర్స్ విలవిల..
ఇషాన్ కిషన్ బ్యాటింగ్ జోరుకు సన్‌రైజర్స్ బౌలర్లు విలవిలలాడుతున్నారు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి పంపిస్తూ జట్టు స్కోరును అమాంతం పెంచేస్తున్నారు. కేవలం 5 ఓవర్‌లలోనే ముంబయి స్కోరు 78 పరుగులు దాటేసింది.
-
ముంబయి జోరు మాములుగా లేదుగా..
భారీ స్కోరు చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ అదే దిశలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. భారీ రన్‌రేట్‌తో గెలుపు అవసరమైన నేపథ్యంలో ముంబయి రెచ్చిపోతోంది. ముఖ్యంగా ఇషాన్ అద్భుత ఆటతీరును కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
-
దుమ్మురేపుతోన్న ఇషాన్ కేవలం 12 బంతుల్లోనే 34 పరుగులు..
ఇషాన్ కిషాన్ మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్నాడు. వరుస బంతులను బౌండరీకి పంపిస్తూ జట్టు స్కోరును పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 12 బంతుల్లోనే 34 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ముంబయి స్కోరు 3 ఓవర్లు ముగిసే సమయానికి 45 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
దూకుడుగా ఆడుతోన్న ఇషాన్.. బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్.
ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతున్నాడు. రెండో ఓవర్‌లో ఏకంగా వరుసగా నాలుగు ఫోర్లు బాది జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. దీంతో ముంబయికి మంచి శుభారంభం లభించింది.
-
రెండో బంతికే సిక్సర్..
భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా బ్యాటింగ్‌లోకి దిగిన ముంబయి తొలి ఓవర్‌లో 8 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ రెండో బంతినే సిక్సర్‌గా బాదాడు. ప్రస్తుతం ముంబయి స్కోరు 8 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
ఇరు జట్ల ప్లేయర్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్:
మనీష్ పాండే (కెప్టెన్), జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్
ముంబయి ఇండియన్స్:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్ -నైల్, పియూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
-
ముంబయి ఆశలు ఆవిరి కాకూడదంటే.. భారీ విజయం తప్పనిసరి.
ప్లేఆఫ్ ఆశలకు గండిపడకూడదంటే ముంబయి ఇండియన్స్ కచ్చితంగా గెలవాలి. అయితే మాములు విజయాన్ని పొందితే సరిపోదు భారీ తేడాతో గెలిస్తేనే ముంబయి ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ ఉద్దేశంతోనే టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకున్నట్లు అర్థమవుతోంది.
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి..
డూ ఆర్ డై అన్న మ్యాచ్‌లో ముంబయి టాస్ గెలిచింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపించారు. ముంబయి బ్యాటింగ్ లైనప్ బాగుండడంతో ముందు బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ తెలిపాడు.
Published On - Oct 08,2021 7:00 PM