RCB vs DC Highlights, IPL 2021: హోరాహోరీ మ్యాచులో బెంగళూరుదే పైచేయి.. 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘన విజయం

Venkata Chari

|

Updated on: Oct 08, 2021 | 11:17 PM

RCB vs DC Highlights in Telugu: చివరో ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో బెంగళూరు టీం విజయం సాధిచింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది.

RCB vs DC Highlights, IPL 2021: హోరాహోరీ మ్యాచులో బెంగళూరుదే పైచేయి.. 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘన విజయం
Ipl 2021 Rcb Vs Dc

DC vs RCB Highlights, IPL 2021: ఐపీఎల్‌ 2021 రెండో దశలో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడ్డాయి. చివరో ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో బెంగళూరు టీం విజయం సాధిచింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. చెన్నైతో పాటు బెంగళూరు కూడా 18 పాయింట్లతో సమానంగా నిలిచింది. కానీ, నెగిటివ్ రన్‌రేట్‌ ఉండడంతో కోహ్లీసేన మూడో స్థానంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ముందు 165 పరుగులు టార్గెట్‌ను ఉంచారు.

ఐపీఎల్‌ 2021 రెండో దశలో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడనున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని ఈ మ్యాచ్ 56 వ నంబర్‌గా జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో హోరాహోరీగా జరగబోతోంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని క్యాపిటల్స్ 0.526 నికర రన్ రేట్‌తో మొదటి స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌కు ఎటువంటి ప్రాముఖ్యత లేదు. అయితే విరాట్ కోమ్లీ సేన మాత్రం తమ స్థానాన్ని మార్చుకునే ఛాన్స్ ఉంది. అంటే ఈ మ్యాచులో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్‌ను స్థానాన్ని ఆక్రమించే ఛాన్స్ ఉంది.

ఇరుజట్లు ఇప్పటి వరకు 25 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు టీం 15 సార్లు విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం 10 మ్యాచుల్లో గెలుపొందింది.

ప్లేయింగ్ ఎలెవన్ :

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), రిపాల్ పటేల్, షిమ్రాన్ హెట్‌మియర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, శ్రీకర్ భారత్ (కీపర్), డేనియల్ క్రిస్టియన్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 08 Oct 2021 11:15 PM (IST)

    బెంగళూరుదే విజయం

    చివరో ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో బెంగళూరు టీం విజయం సాధిచింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది.

  • 08 Oct 2021 10:57 PM (IST)

    18 ‎ఓవర్లకు బెంగళూరు స్కోర్ 146/3

    18 ఓవర్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 3 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది. క్రీజులో శ్రీకర్ భరత్68, మ్యాక్స్‌వెల్ 43 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బెంగళూరు విజయానికి 12 బంతుల్లో 19 పరుగులు కావాల్సి ఉంది.

  • 08 Oct 2021 10:42 PM (IST)

    శ్రీకర్ భరత్ మెయిడిన్ హాఫ్ సెంచరీ

    కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీపర్ శ్రీకర్ భరత్ ఐపీఎల్‌లో తన మెయిడిన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

  • 08 Oct 2021 10:34 PM (IST)

    14 ‎ఓవర్లకు బెంగళూరు స్కోర్ 96/3

    14 ఓవర్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 3 వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. క్రీజులో శ్రీకర్ భరత్ 45, మ్యాక్స్‌వెల్ 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బెంగళూరు విజయానికి 36 బంతుల్లో 69 పరుగులు కావాల్సి ఉంది.

  • 08 Oct 2021 10:18 PM (IST)

    10 ‎ఓవర్లకు బెంగళూరు స్కోర్ 61/3

    10 ఓవర్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 3 వికెట్లు నష్టపోయి 61 పరుగులు చేసింది. క్రీజులో శ్రీకర్ భరత్ 27, మ్యాక్స్‌వెల్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బెంగళూరు విజయానికి 60 బంతుల్లో 104 పరుగులు కావాల్సి ఉంది.

  • 08 Oct 2021 10:06 PM (IST)

    8 ‎ఓవర్లకు బెంగళూరు స్కోర్ 48/2

    8 ఓవర్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 2 వికెట్లు నష్టపోయి 48 పరుగులు చేసింది. క్రీజులో ఏబీడీ 21, శ్రీకర్ భరత్ 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 08 Oct 2021 09:44 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

    కోహ్లీ (4) రూపంలో బెంగళూరు టీం ఇన్నింగస్ మూడో ఓవర్ రెండో బంతికి రెండో వికెట్‌ను కోల్పోయింది. డీసీ బౌలర్ నార్ట్జే దెబ్బకు బెంగళూరు ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు.

  • 08 Oct 2021 09:36 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

    పడిక్కల్ రూపంలో బెంగళూరు టీం తొలి ఓవర్‌లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. నార్ట్జే ఓరల్‌లో అశ్విన్ చేతికి చిక్కి గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్ చేరాడు.

  • 08 Oct 2021 09:19 PM (IST)

    కోహ్లీసేన టార్గెట్ 165

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ముందు 165 పరుగులు టార్గెట్‌ను ఉంచారు.

  • 08 Oct 2021 09:02 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

    శ్రేయాస్ అయ్యర్ (18 పరుగులు, 18 బంతులు, 1 ఫోర్) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. సిరాజ్ వేసిన 17.4 ఓవర్‌లో క్రిస్టియన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.

  • 08 Oct 2021 08:53 PM (IST)

    16 ‎ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 133/3

    16 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది. క్రీజులో అయ్యర్ 13, హెట్‌మెయిర్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 08 Oct 2021 08:35 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

    రిషబ్ పంత్ (10) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. క్రిస్టియన్ వేసిన 12.4 ఓవర్‌లో ఫుల్ షాట్ ఆడబోయిన పంత్ కీపర్ శ్రీకర్ భరత్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో 12.5 ఓవర్లకు ఢిల్లీ టీం 108 పరుగులు చేసింది.

  • 08 Oct 2021 08:28 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

    పృథ్వీ షా (48 పరుగులు, 31 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. చాహల్ వేసిన 11.2 ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయిన షా.. జార్జ్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.

  • 08 Oct 2021 08:21 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

    ధావన్ (43 పరుగులు, 35 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 10.1 ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయిన ధావన్, క్రిష్టియన్‌ చేతికి చిక్కాడు. దీంతో 88 పరుగుల ఓపెనర్లు భాగస్వామ్యానికి తెరపడింది.

  • 08 Oct 2021 08:09 PM (IST)

    8 ‎ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 68/0

    8 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం వికెట్ నష్టోకుండా 68 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్ 31, పృథ్వీ షా 32 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి.

  • 08 Oct 2021 07:57 PM (IST)

    6 ‎ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 55/0

    ఆరు ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం వికెట్ నష్టోకుండా 55 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్ 27, పృథ్వీ షా 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 08 Oct 2021 07:51 PM (IST)

    గబ్బర్ స్పెషల్ సిక్సర్

    ఢిల్లీ ఇన్నింగ్స్‌లో గబ్బర్ తొలి సిక్స్ బాదేశాడు. మ్యాక్స్‌వెల్ వేసిన బంతిని భారీ సిక్స్ కొట్టాడు.

  • 08 Oct 2021 07:44 PM (IST)

    3 ‎ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 25/0

    మూడు ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం వికెట్ నష్టోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్ 13, పృథ్వీ షా 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 08 Oct 2021 07:33 PM (IST)

    మొదలైన ఢిల్లీ బ్యాటింగ్

    టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా బరిలోకి దిగారు.

  • 08 Oct 2021 07:06 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవన్

    ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), రిపాల్ పటేల్, షిమ్రాన్ హెట్‌మియర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, శ్రీకర్ భారత్ (కీపర్), డేనియల్ క్రిస్టియన్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

  • 08 Oct 2021 07:04 PM (IST)

    టాస్ గెలిచిన కోహ్లీసేన

    టాస్ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ టీం బ్యాటింగ్ చేయనుంది.

  • 08 Oct 2021 06:38 PM (IST)

    రెండో స్థానంపై కన్నేసని కోహ్లీసేన

  • 08 Oct 2021 06:35 PM (IST)

    RCB vs DC: హెడ్ టూ హెడ్ రికార్డులు

    ఇరుజట్లు ఇప్పటి వరకు 25 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు టీం 15 సార్లు విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం 10 మ్యాచుల్లో గెలుపొందింది.

  • 08 Oct 2021 06:35 PM (IST)

    హోరాహోరీ పోరుకు సిద్ధం

    ఐపీఎల్‌ 2021 రెండో దశలో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ఎటువంటి ప్రాముఖ్యత లేదు. అయితే విరాట్ కోమ్లీ సేన మాత్రం తమ స్థానాన్ని మార్చుకునే ఛాన్స్ ఉంది. అంటే ఈ మ్యాచులో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్‌ను స్థానాన్ని ఆక్రమించే ఛాన్స్ ఉంది.

Published On - Oct 08,2021 6:33 PM

Follow us