AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepak Chahar: ఎవరీ జయ భరద్వాజ్.. దీపక్‎ చాహార్‎ ఆమెతో ఎలా లవ్‎లో పడ్డాడు..

ప్రియురాలికి మోకాళ్లపై నిల్చోని ప్రపోజ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహార్ అందరి మదిని దోచుకున్నాడు. అతుడు ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది...

Deepak Chahar: ఎవరీ జయ భరద్వాజ్.. దీపక్‎ చాహార్‎ ఆమెతో ఎలా లవ్‎లో పడ్డాడు..
Deepak
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Oct 08, 2021 | 8:38 PM

Share

ప్రియురాలికి మోకాళ్లపై నిల్చోని ప్రపోజ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహార్ అందరి మదిని దోచుకున్నాడు. అతుడు ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత దీపక్ తన చిరకాల స్నేహితురాలు జయ భరద్వాజ్‌ని చాలా మంది ప్రేక్షకుల ముందు ప్రపోజ్ చేశాడు. తమ బంధాన్ని ప్రేక్షకులకు చెప్పేశాడు. జయ భరద్వాజ్‌ ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. దానికి ఆమె సంతోషించి పెళ్లికి ఒప్పేసుకుంది. ఈ జంటకు చెన్నై ఫ్రాంచైజీ సభ్యులు హోటల్‌లో ప్రత్యేక స్వాగతం పలికారు. చప్పట్లతో రండి రండి అంటూ పిలిచారు. వారిపై పూవ్వులు చల్లారు. కేక్ కూడా కోయించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీపక్, జయ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమె చాలా సార్లు స్టాండ్స్‌లో ఉండి చెన్నై మ్యాచులను వీక్షించారు. కానీ వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బయటకు కనిపించనివ్వలేదు.

ఎవరీ జయ భరద్వాజ్..?

ఢిల్లీకి చెందిన జయ భరద్వాజ్ మాజీ బిగ్ బాస్ పోటీదారు, నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ సోదరి కూడా. రియాల్టీ షో ఎంటీవీ స్ల్పిట్స్‎విల్లా-2 గెలిచిన జయ వెలుగులోకి వచ్చారు. ఆమె ముంబై విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. దీపక్ ఈ ఏడాది ప్రారంభంలో జయను తన భారత క్రికెట్ సహచరులు, చెన్నై సూపర్ కింగ్స్ సహచరులకు పరిచయం చేసినట్లు తెలిసింది. కాగా.. పంజాబ్‎తో జరిగిన మ్యాచ్‎లో చెన్నై ఓడిపోయింది. కేఎల్ రాహుల్ 98 పరుగులతో రాణించడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Read Also.. T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు భారత జట్టుకు మరో సవాల్.. అగ్రశ్రేణి జట్లతో కోహ్లీసేన పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

Follow Us
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..