T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు భారత జట్టుకు మరో సవాల్.. అగ్రశ్రేణి జట్లతో కోహ్లీసేన పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 వ ఎడిషన్ క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. యూఏఈలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు భారత జట్టుకు మరో సవాల్.. అగ్రశ్రేణి జట్లతో కోహ్లీసేన పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
T20 World Cup Indian Tea
Follow us
Venkata Chari

|

Updated on: Oct 08, 2021 | 5:36 PM

T20 World Cup 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 వ ఎడిషన్ క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. యూఏఈలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అక్టోబర్ 17 నుంచి 22 వరకు ఎనిమిది జట్లు పోరాడతాయి. టాప్ 8 జట్లు ఇప్పటికే సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించాయి. అయితే క్వాలిఫైయింగ్ రౌండ్ షెడ్యూల్ ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. మ్యాచ్‌లు రెండు రోజులు మాత్రమే జరగనున్నాయి. అక్టోబర్ 18 నుంచి 20 వరకు ప్రతిరోజూ నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 23 నుంచి ప్రారంభమయ్యే సూపర్ 12 రౌండ్ మ్యాచులకు ముందు వరకు ప్రతీ టీం రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత్ పోరు.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అసలు పోరుకు ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. రెండు అగ్రశ్రేణి జట్లతో తమ వార్మప్ మ్యాచులను ఆడనుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత టీం తమ బలాలు, బలహీనలతను తేల్చుకోనుంది. ఈ వార్మప్ మ్యాచులతో ఇరు జట్లకు ఎంతో మేలు చేయనున్నాయి. సూపర్ 12 రౌండ్‌లో తమ ప్రత్యర్థులను ఎదుర్కొనే ముందు పాకిస్తాన్, డిఫెండింగ్ ఛాంపియన్‌లైన వెస్టిండీస్, ‎దక్షిణాఫ్రికా టీంలతో గట్టి సవాలును ఎదుర్కోనుంది. ఇంగ్లండ్‌లోని ఇతర వార్మప్‌లో 2019 వరల్డ్ కప్ ఫైనల్‌లో తలపడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీంలు పోటీపడనున్నాయి. మొత్తంగా దుబాయ్, అబుదాబిలో రెండు రోజుల పాటు 8 మ్యాచ్‌లు జరుగుతాయి.

ప్రత్యక్షప్రసారం చేసే ఛానల్స్ ఇవే.. స్టార్ స్పోర్ట్స్ అక్టోబర్ 17 నుంచి ప్రధాన టోర్నమెంట్‌తో పాటు వార్మప్ మ్యాచులను కూడా ప్రసారం చేయనుంది. అయితే ఇందులో భారత్ ఆడే వార్మప్ మ్యాచ్‌లను మాత్రమే స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్ యాప్ టెలికాస్ట్ చేయనున్నాయి.

సూపర్ 12 రౌండ్ మ్యాచులు మొదలైన రోజే ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీంల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. అదే రోజున 2016 టీ 20 ప్రపంచకప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్‌ల మధ్య మరో వార్మప్ మ్యచ్ జరగనుంది.

వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్.. అక్టోబర్ 18, సోమవారం – షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

మ్యాచ్ 1 – ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా – సాయంత్రం 3:30 గంటలకు

మ్యాచ్ 2 -న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా – రాత్రి 7: 30 గంటలకు

అక్టోబర్ 18, సోమవారం – దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్

మ్యాచ్ 3 – పాకిస్థాన్ వర్సెస్ వెస్టిండీస్ – సాయంత్రం 3:30 గంటలకు

మ్యాచ్ 4 – ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ – రాత్రి 7:30 గంటలకు

అక్టోబర్ 20, బుధవారం – షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

మ్యాచ్ 5 – ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ – సాయంత్రం 3:30 గంటలకు

మ్యాచ్ 6 – దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ – రాత్రి 7:30 గంటలకు

అక్టోబర్ 20, బుధవారం – దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్

మ్యాచ్ 7 – ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా – సాయంత్రం 3:30 గంటలకు

మ్యాచ్ 8 – ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ – రాత్రి 7:30 గంటలకు

Also Read: ICC T20 World Cup 2021: హార్దిక్‌పై వేటు.. చాహాల్‌కు చోటు? రేపే సెలెక్టర్ల సమావేశం.. తేలనున్న టీమిండియా ఆటగాళ్ల భవితవ్యం

PCB: పాక్ క్రికెట్ జట్టుకు బంపర్ ఆఫర్.. ఇండియాపై గెలిస్తే బ్లాంక్ చెక్ ఇస్తారటా.. పీసీబీ ప్రకటన..!