Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 World Cup 2021: హార్దిక్‌పై వేటు.. చాహాల్‌కు చోటు? రేపే సెలెక్టర్ల సమావేశం.. తేలనున్న టీమిండియా ఆటగాళ్ల భవితవ్యం

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఇది కాకుండా ఇతర ఆటగాళ్ల ప్రదర్శనపైనా చర్చ జరగనుంది.

ICC T20 World Cup 2021: హార్దిక్‌పై వేటు.. చాహాల్‌కు చోటు? రేపే సెలెక్టర్ల సమావేశం.. తేలనున్న టీమిండియా ఆటగాళ్ల భవితవ్యం
T20 World Cup Indian Team
Follow us
Venkata Chari

|

Updated on: Oct 08, 2021 | 4:44 PM

T20 World Cup: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) ప్లేఆఫ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే టీ 20 ప్రపంచకప్‌నకు ముందు శనివారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఈ సీజన్ ఐపీఎల్‌లో బీసీసీఐ అనేక సవాళ్లను ఎదుర్కొంది. వీటిలో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ప్రదర్శన బోర్డుకు పెద్ద ఆందోళన కలిగిస్తుంది. ఇద్దరు ఆటగాళ్లు భారత టీ 20 ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్నారు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం అక్టోబర్ 10 వరకు జట్టులో మార్పులు చేసుకోవచ్చు. దీని కారణంగా టీమిండియా సెలెక్టర్లు తమ ప్రపంచకప్ జట్టులో కూడా మార్పులు చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడున్నాయి.

ఈ సమావేశంలో హార్దిక్ పాండ్యాపై ప్రధాన చర్చ జరగనుందని సమాచారం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగా మారింది. బీసీసీఐలోని చాలా మంది అతని ఎంపికను ప్రశ్నించారు. అయితే, సీమ్-ఆల్-రౌండర్‌గా ఇతర బ్యాకప్ సిద్ధంగా లేనందున అతను ప్రస్తుతానికి ఏకైక ఎంపికగా ఉన్నాడు. ఐపీఎల్ 2021 ఫేజ్ 2 లో ఇషాన్ కిషన్ ఫామ్ కూడా ఆందోళన కలిగించింది. సెలెక్షన్ కమిటీలో కొందరు వ్యక్తులు శ్రేయాస్ అయ్యర్‌ను ప్రధాన జట్టులో చేర్చాలనుకుంటున్నారు.

ఎలాంటి మార్పులు జరగనున్నాయంటే..? చివరి నిమిషంలో జట్టును మార్చాలా? శ్రేయాస్ అయ్యర్ కోసం ఇషాన్ కిషన్‌ను డ్రాప్ చేయడానికి టీమ్ మేనేజ్‌మెంట్ అంగీకరిస్తుందా? యుజ్వేంద్ర చాహల్ కోసం రాహుల్ చాహర్‌ను తొలగించాలా? ఈ ప్రశ్నలన్నీ శనివారం జరిగే బోర్డు సెలెక్టర్ల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హార్దిక్ ఔట్ అయితే, అతని స్థానంలో ఒక బ్యాట్స్‌మెన్ చేరే అవకాశం ఉంది. లేదా శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

చాహల్‌పై పెద్ద చర్చ జరగే ఛాన్స్..! యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ సెకండ్ లెగ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చాలా మందిని ఆకట్టుకున్నాడు. దీంతో ఈ సమావేశంలో చాహల్ చర్చనీయాంశం అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా హాజరవుతారు. శాస్త్రి, బీసీసీఐ కార్యదర్శి జై షా కాకుండా, చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొంటుంది.

టీ 20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 17న ఓమన్, పాపువా న్యూ గినియా మధ్య జరగనుంది. అదే సమయంలో అదే రోజు బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్‌ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. టీ 20 ప్రపంచకప్‌లో భారత్ తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో ఆడనుంది.

టీ 20 ప్రపంచకప్ కోసం భారత జట్టు విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ

స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ మరియు దీపక్ చాహర్.

Also Read: IPL 2021 SRH vs MI Live Streaming: హైదరాబాదీలు బాదేస్తారా.. మ్యాచ్‌ను ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా చూడాలో తెలుసా..

IPL 2021: ప్లేఆఫ్స్‌లో అమీతుమీ పోరుకు అంతా సిద్దం.. ముంబై ఆశలు గల్లంతు.!