IPL 2025లో కింగ్ మేకర్లు వీరే.. ప్లే ఆఫ్స్‌పై వీడిన ఉత్కంఠ..
IPL 2025 Points Table: ఐపీఎల్ 2025 ప్రయాణం సగం ముగిసింది. అన్ని జట్లు కనీసం ఏడు లీగ్ మ్యాచ్‌లు ఆడాయి. అలాగే, నాలుగు జట్ల ఖాతాలో తలో 10 పాయింట్లు ఉండగా, ఒక జట్టుకు 8 పాయింట్లు, రెండు జట్లకు చెరో 6 పాయింట్లు, మూడు జట్లకు తలో 4 పాయింట్లు ఉన్నాయి.

IPL 2025 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ లీగ్ దశ సగం పూర్తయింది. శనివారం ఏప్రిల్ 19 నాటికి, అన్ని జట్లు కనీసం 7 లీగ్ మ్యాచ్‌లు ఆడాయి. ఇంకా 7 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, రెండు జట్లు మాత్రం 8 మ్యాచ్‌లు ఆడాయి. ఈ ఐపీఎల్ సీజన్ ప్రయాణంలో సగం పూర్తయిన తర్వాత, నాలుగు జట్లు తమ ఖాతాలో తలో 10 పాయింట్లను కలిగి ఉన్నాయి. వీటిలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి.
పాయింట్ల పట్టికలో గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, లక్నో వరుసగా మొదటి నుంచి నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు కూడా ప్లేఆఫ్స్‌కు తమ హక్కును బలంగా చాటుతున్నాయి. ఎందుకంటే, లక్నో 8 మ్యాచ్‌లు ఆడగా, మిగిలిన జట్లు ఏడు మ్యాచ్‌లు ఆడాయి. ఈ జట్లు మిగిలిన 6 లేదా ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిస్తే, సులభంగా ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, ఈ నాలుగు జట్ల వాదన ఇతర 6 జట్ల కంటే బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ఒక జట్టు ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే RCB ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. ఆరు, ఏడవ స్థానంలో ఉన్న జట్లు, అంటే కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలో 7 మ్యాచ్‌ల్లో చెరో 6 పాయింట్లు సాధించాయి. రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించాయి. రాజస్థాన్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో, హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో, చెన్నై 10వ స్థానంలో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ కు ఇబ్బందులు మరింత పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు 16 పాయింట్లను చేరుకోవాలంటే మిగిలిన 6 మ్యాచ్ లను గెలవాల్సిందే. లేదంటే లీగ్ నుంచి తప్పుకోవడమే.
36 మ్యాచ్ ల తర్వాత IPL 2025 పాయింట్ల పట్టిక..
| సంఖ్య | జట్టు | ఆడిన మ్యాచ్‌లు | గెలిచిన మ్యాచ్‌లు | ఓడిపోయినవి | పాయింట్లు | నెట్ రన్ రేటు |
|---|---|---|---|---|---|---|
| 1. | గుజరాత్ టైటాన్స్ | 7 | 5 | 2 | 10 | +0.984 |
| 2. | ఢిల్లీ క్యాపిటల్స్ | 7 | 5 | 2 | 10 | +0.589 |
| 3. | పంజాబ్ కింగ్స్ | 7 | 5 | 2 | 10 | +0.308 |
| 4. | లక్నో సూపర్ జెయింట్స్ | 8 | 5 | 3 | 10 | +0.088 |
| 5. | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 7 | 4 | 3 | 8 | +0.446 |
| 6. | కోల్‌కతా నైట్ రైడర్స్ | 7 | 3 | 4 | 6 | +0.547 |
| 7. | ముంబై ఇండియన్స్ | 7 | 7 | 4 | 6 | +0.239 |
| 8. | రాజస్థాన్ రాయల్స్ | 8 | 2 | 6 | 4 | -0.633 |
| 9. | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 7 | 2 | 5 | 4 | -1.217 |
| 10. | చెన్నై సూపర్ కింగ్స్ | 7 | 2 | 5 | 4 | -1.276 |
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




