IPL 2025 Mega Auction: 6వ ట్రోపీ లోడింగ్.. డేంజరస్ ఆల్ రౌండర్ ఎంట్రీతో ఫుల్ స్వింగ్‌లో ముంబై..

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలిచేందుకు ముంబై ఇండియన్స్ పక్కా ప్లాన్స్‌తో మెగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఓ భయంకరమైన ఆటగాడిని తన స్వ్కాడ్‌లో చేర్చుకుంది. దీంతో ఆరో ట్రోఫీ ముంబై ఖాతాలో చేరినట్లేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

IPL 2025 Mega Auction: 6వ ట్రోపీ లోడింగ్.. డేంజరస్ ఆల్ రౌండర్ ఎంట్రీతో ఫుల్ స్వింగ్‌లో ముంబై..
Mumbai Indians
Follow us
Venkata Chari

|

Updated on: Nov 26, 2024 | 6:14 PM

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 ట్రోఫీని ముంబై ఇండియన్స్ గెలుచుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు ఆ జట్టులోకి ఓ భయంకరమైన ఆటగాడు ప్రవేశించాడు. అతను బ్యాటింగ్, బౌలింగ్‌లో చాలా ప్రమాదకరమైనవాడిగా పేరుగాంచాడు. ఈ ఆటగాడి రాకతో ముంబై ఇండియన్స్ ఆరో ఐపీఎల్ ట్రోఫీ ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ఈ తుఫాన్ ఆటగాడు ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త బలం చేకూర్చనున్నాడు. ఈ ఆటగాడు తన ఐపీఎల్ కెరీర్‌ని 2024 సీజన్‌లో ప్రారంభించాడు. గత సీజన్‌లో, ఈ ఆటగాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతూ తుఫాన్ సెంచరీ కూడా చేశాడు.

ముంబై ఇండియన్స్ జట్టులో తుఫాన్ ఆల్ రౌండర్ ప్రవేశం..

ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు ప్రమాదకరమైన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్వెస్‌ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ విల్ జాక్వెస్ తుఫాన్ బ్యాటింగ్‌తో పాటు డేంజరస్ ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో నిపుణుడు. విల్ జాక్వెస్ ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగమయ్యాడు. కానీ, అతన్ని కొనసాగించలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు గెలిచి విల్ జాక్వెస్‌ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. విల్ జాక్వెస్ రాకతో ముంబై ఇండియన్స్ బలం చాలా రెట్లు పెరిగింది.

ఆరో ఐపీఎల్ ట్రోఫీని గెలిచే ఛాన్స్..

ఐపీఎల్ 2024 సీజన్‌లో జాక్వెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడాడు. 2024 ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో, విల్ జాక్వెస్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విల్ జాక్వెస్ ఈ తుఫాను సెంచరీని సాధించాడు. విల్ జాక్వెస్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 175.57 స్ట్రైక్ రేట్, 32.86 సగటుతో 230 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

చివరకు ముంబై ఇండియన్స్ విజయం..

ఐపీఎల్‌లో విల్ జాక్వెస్ పేరిట ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇది కాకుండా ఐపీఎల్‌లో విల్ జాక్వెస్ 2 వికెట్లు తీశాడు. భారత పిచ్‌లపై విల్‌ జాక్వెస్‌ భీకర ఫామ్‌ని చూసి ఐపీఎల్‌ టీమ్‌లన్నీ అతడిని ఈ సీజన్‌కు చేర్చాలని భావించాయి. చివరకు ముంబై ఇండియన్స్‌ ఈ ఆటగాడిని రూ.5.25 కోట్లకు దక్కించుకుంది.

ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు..

జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా ఘజన్‌ఫర్, విల్ జాక్వెస్, అశ్విని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లే , రాజ్ అంగద్ బావా, సత్యనారాయణ రాజు, బెవోన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..