GT vs RCB, IPL 2024: దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
Gujarat Titans vs Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ( 49 బంతుల్లో 84 నాటౌట్, 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి షారుఖ్ ఖాన్ ( 30 బంతుల్లో 58 నాటౌట్, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చక్కటి సహకారం అందించారు
Gujarat Titans vs Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ( 49 బంతుల్లో 84 నాటౌట్, 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి షారుఖ్ ఖాన్ ( 30 బంతుల్లో 58 నాటౌట్, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చక్కటి సహకారం అందించారు. ఆఖరిలో డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26 నాటౌట్, 2 ఫోర్లు,ఒక సిక్సర్) కొన్ని మెరుపులు మెరిపించాడు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (5), శుభమన్ గిల్ (16) తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్, సిరాజ్, మాక్స్‌వెల్ తలో వికెట్ తీశారు. కాగా ప్లే ఆఫ్ అవకాశాలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఇరు జట్లకు చాలా ముఖ్యం. ప్రధానంగా ఈ మ్యాచ్ ఆర్సీబీకి చావో రేవో లాంటిది. మరి ఈ భారీ స్కోరును కోహ్లీ అండ్ టీమ్ ఛేదిస్తుందో లేదో చూడాలి.
సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ హైలెట్..
Sai Sudharsan attacks Mohd. Siraj for a strong finish 💪
Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #GTvRCB | @gujarat_titans pic.twitter.com/swsS5UF608
— IndianPremierLeague (@IPL) April 28, 2024
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
గుజరాత్ టైటాన్స్ – వృద్ధిమాన్ సాహా(కీపర్), శుబ్మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
సందీప్ వారియర్, శరత్ బీఆర్, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
ఇంపాక్ట్ ప్లేయర్లు..
అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, హిమాన్షు శర్మ, ఆకాష్ దీప్, విజయ్‌కుమార్ వైషాక్.
షారుక్ కు తొలి ఐపీఎల్ అర్ధ సెంచరీ..
MAXIMUM! 🚀
Bringing up 💯 in style, the Shahrukh Khan way 🥳
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #GTvRCB pic.twitter.com/yap3nfcMEx
— IndianPremierLeague (@IPL) April 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..