Virat Kohli No Ball Controversy: ఔటా.. నాటౌటా.. విరాట్ కోహ్లీ కాంట్రీవర్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన స్టార్‌స్పోర్ట్స్..
IPL 2024: ఐపీఎల్ 2024 36వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఆర్సీబీ జట్టు 221 పరుగులు చేసి 1 పరుగు తేడాతో ఓడిపోయింది. కాగా, ఈ మ్యాచ్ నాటకీయ పరిస్థితులకు కారణంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఔట్ పలు చర్చకు దారితీసింది.

Virat Kohli No Ball Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 36వ మ్యాచ్ నాటకీయ పరిస్థితులకు కారణంగా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఔట్ పలు చర్చకు దారితీసింది. కాగా, ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ నో బాల్ కారణంగా వార్తల్లో నిలిచింది. థర్డ్ అంపైర్ విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. కానీ, చాలా మంది మాజీ క్రికెటర్లు, అభిమానులు విరాట్ కోహ్లి నాటౌట్ అని, ఆ బంతిని నో బాల్ గా ప్రకటించాల్సి ఉంటుందని నమ్ముతున్నారు.
వాస్తవానికి లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్‌సీబీ జట్టు దూకుడు మీదుంది. మూడో ఓవర్‌లో హర్షిత్ రాణా వేసిన ఫుల్ టాస్ బంతికి విరాట్ కోహ్లీ షాట్ ఆడగా బంతి గాలిలోకి వెళ్లిపోయింది. హర్షిత్ రాణా స్వయంగా తన బంతికి క్యాచ్ పట్టాడు. విరాట్ కోహ్లి క్రీజుకు కొంచెం ముందుగా షాట్ కొట్టాడు. బంతి నడుము ఎత్తుకు పైనే ఉందని, దానికి నో బాల్ ఇవ్వాలి అని భావించాడు. అంపైర్ కోహ్లిని అవుట్‌గా ప్రకటించాడు. కానీ, విరాట్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. కానీ, థర్డ్ అంపైర్ కూడా ఆ బాల్ చెల్లుబాటు అయ్యేదిగా భావించి విరాట్ కోహ్లిని అవుట్‌గా ప్రకటించాడు. ఈ కారణంగానే అంపైర్లతో విరాట్ కోహ్లి చాలాసేపు వాగ్వాదానికి దిగాడు.
Virat Kohli had a chat with the umpire after the match. pic.twitter.com/mya45sbKW2
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2024
ఇప్పుడు నో బాల్‌కు సంబంధించి నియమం ఏమిటో ఓసారి తెలుసుకుందాం.. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ ఓ ట్వీట్ చేస్తూ నడుము ఎత్తుకు సంబంధించి నో బాల్ నిబంధనలు ఏమిటో వివరించింది. దీని ప్రకారం, అధికారిక రూల్ బుక్ ప్రకారం విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. నడుము ఎత్తు కంటే ఎక్కువ ఉన్న బాల్‌కు నో బాల్ ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే, విరాట్ కోహ్లి విషయానికి వస్తే, అతను బంతిని కొట్టినప్పుడు, బంతి నడుము ఎత్తులో ఉంది. కానీ, బంతి స్టెపింగ్ క్రీజ్‌ను దాటుతున్నప్పుడు, అది నడుము ఎత్తు కంటే తక్కువగా ఉంది. ఈ కారణంగా అధికారిక నిబంధనల ప్రకారం ఈ బంతి సరైనదిగా మారింది.
Virat was indeed out as per the official rule book. The rule states that for a delivery to be considered a no ball, the ball must be at waist height as it crosses the stepping crease.
In Kohli’s situation, while the ball was at waist height when he encountered it, as it crossed… pic.twitter.com/RHLHZpnnTg
— Star Sports (@StarSportsIndia) April 21, 2024
దీని ప్రకారం, క్రీజులో కోహ్లీ బ్యాటింగ్ స్థితిని పరిగణనలోకి తీసుకుంటే, బంతి గమనం నడుము నుంచి 0.12 మీటర్ల దిగువన ఉంది. అంటే కోహ్లి ఎత్తుకు అనుగుణంగా నో బాల్ ఇవ్వాలంటే ఆ బంతి నడుము నుంచి 1.04 మీటర్లు ప్రయాణించాలి. కానీ, హర్షిత్ రాణా విసిరిన బంతి 0.92 మీటర్ల ఎత్తులో ప్రయాణించింది. అందుకే థర్డ్ అంపైర్ నో బాల్ కాదని, ఫుల్ టాస్ బాల్ అవుట్ అని తేల్చాడు.
ఈ వివాదానికి ప్రధాన కారణం థర్డ్ అంపైర్ చూపిన హాక్ ఐ పిక్చర్ అంటే తప్పేమీ కాదు. ఎందుకంటే టీవీ అంపైర్ విరాట్ కోహ్లి ముందుకు వచ్చి బంతిని ఎదుర్కొంటూనే బంతి దారిని చూపించాడు. అదే సమయంలో, అతని బ్యాటింగ్ వైఖరి (బ్యాటింగ్‌కు స్టాండింగ్ పొజిషన్) చూపించి, బంతి పథాన్ని ప్రదర్శిస్తే, ఇంత గందరగోళం ఉండేది కాదని అంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




