MI vs LSG, IPL 2024: నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. రాణించిన కేఎల్ రాహుల్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

Mumbai Indians vs Lucknow Super Giants: ఈ సీజన్ లో ఆఖరి మ్యాచ్ ఆడుతోన్న లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్ల, సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ 29 బంతుల్లో 75 పరుగులు చేశాడు

MI vs LSG, IPL 2024: నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. రాణించిన కేఎల్ రాహుల్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
Nicholas Pooran, K L Rahul
Follow us
Basha Shek

|

Updated on: May 17, 2024 | 9:58 PM

Mumbai Indians vs Lucknow Super Giants: ఈ సీజన్ లో ఆఖరి మ్యాచ్ ఆడుతోన్న లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్ల, సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ 29 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అలాగే కెప్టెన్ కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 55 ( 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పూరన్ , రాహుల్ ల జోరు చూస్తుంటే లక్నో స్కోరు 250 పరుగులు దాటుతుందని పించింది.   కానీ వీరిద్దరూ ఔటైన తర్వాత లక్నో వరుసగా 3 వికెట్లు కోల్పోయింది.  అయితే ఆఖరి ఓవర్లలో ఆయుష్ బదోనీ,  కృనాల్ పాండ్యా కొన్ని మెరుపు లు మెరిపించారు. దీంతో లక్నో స్కోరు 200 పరుగుల మార్కును చేరుకోగలిగింది.

ఇవి కూడా చదవండి

ముంబై బౌలర్లలో నువాన్ తుషార, పీయూష్ చావ్లా చెరో 3 వికెట్లు పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్ లో స్థానం దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో నిరాశ పర్చాడు. 2.2 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకున్నాడు.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, నెహాల్ వాద్రా, రొమారియో షెపర్డ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషారా.

ఇంపాక్ట్  ప్లేయర్లు: 

రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI:

కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.

ఇంపాక్ట్  ప్లేయర్లు:

నవీన్-ఉల్-హక్, ఆష్టన్ టర్నర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..