AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేయగా..

ఏపీలో గంజాయి అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్యాధునిక డ్రోన్‌ల సర్వేతో అక్రమార్కుల గుండెల్లో హడల్‌ పుట్టిస్తున్నారు. గుట్టుచప్పుడుకాకుండా పండిస్తున్న గంజాయి వాసన పసిగడుతున్నారు. అయితే కొందరు గంజాయి రవాణా కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించడం చర్చనీయాంశమవుతుంది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Nellore: ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేయగా..
Bag In Bus (Representative image)
Ram Naramaneni
|

Updated on: Dec 26, 2024 | 1:36 PM

Share

ఎంత బరితెగింపు.. ఎంత కండకావరం.. ఎంత లెక్కలేనితనం.. లేకపోతే ఏకంగా ఆర్టీసీ బస్సునే గంజాయి రవాణాకు వినియోగించుకున్నారు కేటుగాళ్లు. సూపర్ లగ్జరీ బస్సులో ఎంచక్కా గంజాయిని ట్రాన్స్‌పోర్ట్ చేద్దామని భావించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 కిలోల గంజాయి సీజ్ చేశారు..వివరాల్లోకి వెళితే.. బుధవారం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద పోలీసులు వాహనాల సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్‌ విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తోంది. పోలీసులు బస్సులో తనిఖీలు చేపట్టగా.. ఓ సంచి అనుమానాస్పదంగా కనిపించింది. అనుమానం వచ్చి చెక్ చేయగా అందులో గంజాయి బటపడింది. అందులో ఆరు ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 12 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయి అక్రమంగా రవాణాకు యత్నించిన… తమిళనాడు రాష్ట్రం తిరుచరాపల్లి జిల్లాకు చెందిన ఇలావరసన్‌, తమిళనాడు నమక్కల్‌ జిల్లాకు చెందిన రాగుల్‌ ధవకుమార్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 సెల్‌ఫోన్లు కూడా సీజ్ చేశారు.

తమిళనాడు సేలంలో గంజాయిని అధిక రేటుకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితుల విచారణలో తేలింది.  విశాఖపట్నం జిల్లా చోడవరంలోని గోవింద్‌ అనే వ్యక్తి వద్ద వారు గంజాయి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ గంజాయి అమ్మిన వ్యక్తిని కూడా పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. యువతను నిర్వీర్యం చేస్తోన్న గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు తెలిపారు. గంజాయి నెట్‌వర్క్ వెనుకు ఎంతటివారు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..