కార్డియాక్ సర్జన్ అటాను సాహా మాట్లాడుతూ.. మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోకపోతే, మెదడు న్యూరాన్లు నెమ్మదిగా చనిపోతాయి. రోజంతా పని చేయడం వల్ల ఒత్తడి మెదడును ప్రభావితం చేస్తుంది. నిద్ర మరుసటి రోజుకు మెదడును రీసెట్ చేస్తుంది. అయితే సరిగ్గా నిద్రపోకపోతే షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ సమస్యలు, నరాల సమస్యలు వస్తాయి. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా 60-70 ఏళ్లలో వచ్చే ప్రమాదం ఉంది.