AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరూ చూస్తుండగానే కళ్ళ ముందే కాలిబూడిదైన రూ.5 కోట్ల విలువైన లంబోర్గినీ కారు!

ముంబైలో దురదృష్టకర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కోస్టల్ రోడ్‌లో లంబోర్గినీ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు రోడ్డుపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన వీడియోను వ్యాపార దిగ్గజం గౌతమ్ సింఘానియా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇందులో రూ. 5కోట్ల విలువైన కారు కాలిపోతున్నట్లు కనిపించింది.

అందరూ చూస్తుండగానే కళ్ళ ముందే కాలిబూడిదైన రూ.5 కోట్ల విలువైన లంబోర్గినీ కారు!
Lamborghini Car Fire
Balaraju Goud
|

Updated on: Dec 26, 2024 | 1:23 PM

Share

ముంబైలోని కోస్టల్ రోడ్డులో సుమారు రూ.5 కోట్ల విలువైన లంబోర్గినీ కారు మంటల్లో చిక్కుకుంది. కొద్దిసేపటికే కారు మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన బుధవారం(డిసెంబర్ 25) రాత్రి 10:20 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేకపోవడం ఉపశమనం కలిగించే అంశం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను వ్యాపార దిగ్గజం, కారు ఔత్సాహికుడు గౌతమ్ సింఘానియా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

ముంబై వీధుల్లో కదులుతున్నప్పుడే రూ. కోట్ల విలువై లంబోర్ఘినీ కారు అగ్నిప్రమాదానికి గురైంది. రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిమాపక దళం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 45 నిమిషాల్లో మంటలను అదుపు చేశారు. స్పోర్ట్స్ కారులో ఉన్నవారు, దాని యజమాని గురించిన వివరాలు ఇంకా ధృవీకరించబడలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కారు, లంబోర్ఘిని హురాకాన్ ఒక స్పోర్ట్స్ కారు. దీన్ని సూపర్ కార్‌గా పరిగణిస్తారు. దీని గరిష్ట వేగం 202 mph కంటే ఎక్కువ.

రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, గౌతమ్ సింఘానియా సంఘటనకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. “ముంబైలోని కోస్టల్ రోడ్‌లో లంబోర్ఘిని మంటల్లో చిక్కుకుంది. ఇలాంటి సంఘటనలు లంబోర్ఘిని విశ్వసనీయత, భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. ధర, ఖ్యాతి కోసం, రాజీపడని నాణ్యతను ఆశించవచ్చు. ప్రమాదాల నివారణకు ఉత్తమంగా ఉండాలి అంటూ రాసుకొచ్చారు. వీడియో చూడండి..

సోషల్ మీడియాలో పంచుకున్న మరో వీడియోలో, గుజరాత్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న ఆరెంజ్ కలర్ కారులో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని, అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ముంబై పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..