Viral Video: ఏనుగుపై ఇద్దరు వ్యక్తులతో కలిసి పులి షికారు.. షాకింగ్ వీడియో వైరల్..

అడవిలో నివసించే క్రూర జంతువులలో ఒకటి పులి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అవకాశాన్ని చూసి తన ఎరపై దాడి చేయడంలో పసిద్ది చెందిన జంతువు. అయితే ప్రస్తుతం ఓ వీడియో ఓ రేంజ్ లో నెటిజన్లను కట్టుకుంటుంది. అది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు కూడా.. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పులిని పట్టుకుని.. ఏనుగుపై సవారీ చేస్తూ కనిపించారు.

Viral Video: ఏనుగుపై ఇద్దరు వ్యక్తులతో కలిసి పులి షికారు.. షాకింగ్ వీడియో వైరల్..
Viral VideoImage Credit source: Social media
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2024 | 1:39 PM

ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పుడు, ఏ విషయాలు కనిపిస్తాయో ఎవరూ చెప్పలేరు. సోషల్ మీడియా పేజీలో ఇప్పుడు రీల్స్, వైరల్ వీడియోలు ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. వాటిని ఇష్టంగా చూసేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వీడియోలు చూస్తున్న సమయంలో ఎవరూ ఊహించని వీడియో కనిపించింది. ఈ వీడియో చూసిన వారు ఒక్కోసారిగా స్టన్ అయిపోతారు. అసలు ఇలా జరుగుతుందా అని ఆలోచిస్తారు. ఇది చూసిన తర్వాత నవ్వుతారు కూడా .. అసలు ఇలాంటి పనులు ఎలా చేస్తారు? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అని కూడా అంటారు.

అడవిలో ప్రమాద కరమైన జంతువుల్లో సింహం, పులి, ఎలుగుబంటి, చిరుత పులి వంటివి గుర్తుకొస్తాయి. ఇవి జంతువులకు, మానవులకు కూడా ప్రమాదకరమైన జంతువులు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి.. పులిని నియంత్రించి తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో కాస్త భిన్నంగా ఉంది. పులి అతని పెంపుడు జంతువుగా అనిపిస్తుంది. ఈ వైరల్ అవుతున్న ఈ వీడియో బీహార్‌కు చెందినదని. ఇద్దరు వ్యక్తులు ఏనుగుపై కూర్చొని పులిని తమతో పాటు కూర్చోబెట్టుకుని షికారు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఏనుగుపై ఇద్దరు వ్యక్తులు కూర్చోవడం, వారితో పాటు ఓ పులి కూడా ఆనందంగా కూర్చోవడం వీడియోలో కనిపిస్తోంది. అందులో ఒకరు జనాల ముందు తాను హీరో అయ్యాడంటూ టైగర్‌ని వేధించడం కనిపిస్తే, ఒక్కోసారి టైగర్ చెవులను పట్టుకుని గట్టిగా తిప్పుతున్నాడు. అసలు అది పులా పెంపుడు పిల్లా అన్నట్లు కూర్చుని ఉంది.

@guru_ji_ayodhya అనే ఖాతా ద్వారా Xలో వీడియో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటి వరకూ దీనిని ఐదు లక్షల మందికి పైగా చూసి, కామెంట్స్ చేస్తూ తమ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వ్యక్తులు చాలా ప్రమాదకరం అని ఒక వినియోగదారు రాశారు. మరొకరు ‘అటవీ శాఖ వారే అయి ఉండాలి.. లేకుంటే సామాన్యులెవరికీ ఇలా చేసే ధైర్యం ఉండదు’ అని రాశారు. మరో వినియోగదారు, ‘ఈ వీడియో బీహార్‌కి చెందినది కాదు.. కార్బెట్ పార్క్ రామ్‌నగర్‌లోనిది. ఈ పులిని అటవీ శాఖ పట్టుకుంది’ అని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!