IPL 2024: ‘అమ్మ తన నగలను అమ్మి షూస్ కొనిచ్చింది’.. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ సక్సెస్ స్టోరీ.. వీడియో

|

May 26, 2024 | 5:16 PM

బిహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన షకీబ్ హుస్సేన్ ది వ్యవసాయ కుటుంబం. తండ్రి అహ్మద్ హుస్సేన్ ఒక్కరోజు పని చేయకపోయినా కుటుంబమంతా సగం కడుపుతో గడపాల్సిందే. అందుకే యుక్తవయస్సు రాకముందే షకీబ్ హుస్సేన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. భారత సైన్యంలో పనిచేయాలనుకున్నాడు. తద్వారా తన కటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుందనుకున్నాడు.

IPL 2024: అమ్మ తన నగలను అమ్మి షూస్ కొనిచ్చింది.. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ సక్సెస్ స్టోరీ.. వీడియో
KKR Pacer Shakib Hussain
Follow us on

IPL 2024 చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున యువ పేసర్ షకీబ్ హుస్సేన్ బరిలోకి దిగే సూచనలున్నాయి. షకీబ్ ది హల్క్ బాడీ… బాడీబిల్డింగ్‌తో కూడిన సిక్స్ ప్యాక్ బాడీ. ఒక్క సారి ఈ కుర్రాడిని చూస్తే ఆర్మీకి సరిగ్గా సరిపోతాడని చెప్పొచ్చు. కానీ తన కలను కాదని కోల్‌కతా నైట్ రైడర్స్ శిబిరంలో షకీబ్ కనిపించడం గమనార్హం. అయితే ఈ ఫిజిక్ వెనుక సైన్యంలో చేరాలనే పెద్ద కల కూడా ఉంది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన షకీబ్ హుస్సేన్ ది వ్యవసాయ కుటుంబం. తండ్రి అహ్మద్ హుస్సేన్ ఒక్కరోజు పని చేయకపోయినా కుటుంబమంతా సగం కడుపుతో గడపాల్సిందే. అందుకే యుక్తవయస్సు రాకముందే షకీబ్ హుస్సేన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. భారత సైన్యంలో పనిచేయాలనుకున్నాడు. తద్వారా తన కటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుందనుకున్నాడు. ఈ పెద్ద కలతో, షకీబ్ హుస్సేన్ తన ఇంటి సమీపంలోని మైదానంలో ప్రతిరోజూ ఉదయాన్నే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆర్మీ ఎంపిక కోసం కసరత్తు కూడా మొదలుపెట్టాడు. ఈ సమయంలో అతడిని గమనించిన కొందరు క్రికెట్ ఆడమని సలహా ఇచ్చారు.

క్రికెట్ ప్రముఖులైన తునవ్ గిరి, కుమార్ గిరి, జావేద్ సర్, రాబిన్ సర్.. అహ్మద్ హుస్సేన్ కొడుకును క్రికెటర్ ను చేయమని చెప్పారు. ఎందుకంటే అతనికి అద్భుతమైన వేగం ఉంది. మెరుగైన బౌలర్‌గా ఎదగగలడని అన్నాడు. ఇంతకు ముందు షకీబ్ హుస్సేన్ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడాడు. అయితే, అతను క్రికెట్‌పై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడు. కానీ లెదర్ బాల్ క్రికెట్ ఆడాలంటే మంచి స్పైక్డ్ షూస్ అవసరం.స్పైక్డ్ షూస్ కొనడానికి 10,000 నుండి 15,000 అవసరం. అయితే, తల్లి తన బంగారు ఆభరణాలను విక్రయించి, తన కొడుకు కోసం స్పైక్డ్ షూలను కొనుగోలు చేసింది. ఈ బూట్లతో కొత్త కలను నిర్మించుకున్న షకీబ్.. తన ఫాస్ట్ బౌలింగ్ తో బిహార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కనిపించి 4 వికెట్లు పడగొట్టాడు షకీబ్. ఈ ప్రదర్శన ఫలితంగా, అతను IPL 2023లో CSK జట్టు ద్వారా నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఐపీఎల్ జట్టులో చోటు దక్కించుకోవాలన్నది షకీబ్ కల. అందుకే ఈసారి కూడా తన పేరును ఐపీఎల్ వేలానికి పెట్టాడు. కానీ తొలి రౌండ్‌లో ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు. దీంతో ఈసారి కూడా షకీబ్ హుస్సేన్ తన ఐపీఎల్ కలను వదులుకున్నాడు. కోచ్ రాబిన్ సింగ్‌కు కూడా ఫోన్ చేసి తన నిరాశను పంచుకున్నాడు. అయితే కొద్ది క్షణాల్లో జరిగిన చివరి రౌండ్‌లో షకీబ్ హుస్సేన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. షకీబ్ సాధించిన విజయానికి ఊరంతా సంబరాలు చేసుకుంది.

 

‘మా అబ్బాయి తన తల్లిదండ్రుల కష్టాలను బాగా అర్థం చేసుకున్నాడు. చాలా మంచి అబ్బాయి. మాకు ఇంతకంటే ఏం కావాలి’ అంటున్నారు షకీబ్ హుస్సేన్ తండ్రి అహ్మద్. 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న షకీబ్ హుస్సేన్ ఇప్పుడు కేకేఆర్ జట్టులో ఉన్నాడు. కానీ ఈ ఐపీఎల్‌లో యువ స్పీడ్‌స్టర్‌కు మ్యాచ ్ఆడే అవకాశం రాలేదు. అయితే షకీబ్ తన స్పీడుతో కేకేఆర్ శిబిరంలో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న షకీబ్ హుస్సేన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. అందుకే రానున్న రోజుల్లో భారత జట్టుకు మరో స్పీడ్ మాస్టర్ దొరికినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..