IPL 2024: ఎంఎస్ ధోని నెక్ట్స్ ఐపీఎల్ ఆడతాడా? సీఎస్కే సీఈవో సమాధానమిదే

ఇదిలా ఉంటేలీగ్ స్థాయిలోనే తన ప్రయాణాన్ని ముగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తదుపరి ఎడిషన్‌లో ఆడతాడా? లేదా? ఈ ప్రశ్నకు ధోని స్వయంగా సమాధానం చెప్పాలి. అయితే ఇంతలో CSK CEO ధోని అభిమానులకు...

IPL 2024: ఎంఎస్ ధోని నెక్ట్స్ ఐపీఎల్ ఆడతాడా? సీఎస్కే సీఈవో సమాధానమిదే
MS Dhoni
Follow us
Basha Shek

|

Updated on: May 23, 2024 | 10:28 PM

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో మాత్రం ప్లే ఆఫ్స్ కు చేరకుండానే నిష్ర్కమించింది. కీలక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన సీఎస్కే భారంగా టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇదిలా ఉంటేలీగ్ స్థాయిలోనే తన ప్రయాణాన్ని ముగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తదుపరి ఎడిషన్‌లో ఆడతాడా? లేదా? ఈ ప్రశ్నకు ధోని స్వయంగా సమాధానం చెప్పాలి. అయితే ఇంతలో CSK CEO ధోని అభిమానులకు శుభవార్త అందించాడు. ధోనీ రిటైర్మెంట్ విషయంపై స్పందించిన కాశీ విశ్వనాథన్ తాము ధోని నిర్ణయం కోసం జట్టు వేచి ఉంటుందని పేర్కొన్నారు. ఫ్రాంచైజీ తమ మాజీ కెప్టెన్ నిర్ణయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోబోమని క్లారిటీ ఇచ్చేశారు. ‘అభిమానుల మాదిరిగానే, ఫ్రాంచైజీ ధోని తిరిగి వచ్చి 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో సీజన్ ఆడతాడని ఆశిస్తోంది. అయితే ధోని ఆడడం గురించి నాకు తెలియదు. ఈ ప్రశ్నకు ధోని మాత్రమే సమాధానం చెప్పాలి. అయితే ఎంఎస్ తీసుకున్న నిర్ణయాలను మేం ఎప్పుడూ గౌరవిస్తాం. కానీ మీ అందరికీ తెలిసినట్లుగా, అతను ఎల్లప్పుడూ తన నిర్ణయాలను వెంటనే తీసుకోడు. సరైన సమయంలో వాటిని ప్రకటిస్తాడు. కానీ అతను వచ్చే ఏడాది CSKకి అందుబాటులో ఉంటాడని మాకు చాలా నమ్మకం ఉంది’ అని సీఎస్కే సీఈవో చెప్పుకొచ్చారు.

కేవలం సీఈవో మాత్రమే కాదు, ఎంఎస్ ధోనీ మాజీ సహచరులు అంబటి రాయుడు, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప వచ్చే సీజన్‌లో మహి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో నిరాశపరిచిన ఓటమి తర్వాత 18వ సీజన్‌లో ధోనీ తిరిగి పునరాగమనం చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడని ఊతప్ప చెప్పాడు. మరి వీరందరూ చెబుతున్నట్లు ధోని తర్వాతి ఐపీఎల్ లో కనిపిస్తాడా? లేదా సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటన ఇచ్చేసి షాక్ ఇస్తాడా? అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..