virat kohli: ఈ సారి గట్టిగా గెలికేసారు భయ్యా! ఏకంగా జోకర్ అంటూ పిచ్చి కూతలు కూసిన ఆస్ట్రేలియన్ మీడియా
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సామ్ కాన్స్టాస్ ల మధ్య వాగ్వాదం భారత క్రికెట్‌లో కొత్త చర్చలకు దారితీసింది. కోహ్లీపై జరిమానా విధించినప్పటికీ, ఆసీస్ మీడియా అతడిని "జోకర్"గా అవమానించడం వివాదాన్ని మరింత పెంచింది. 19 ఏళ్ల కాన్స్టాస్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ, ఈ సంఘటన అతనికి అధికంగా ప్రచారం అందించింది.
మెల్‌బోర్న్‌లో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువకుడు సామ్ కాన్స్టాస్ మధ్య జరిగిన వాగ్వాదం పెద్ద వివాదానికి దారితీసింది. కోహ్లీ, ఉద్దేశపూర్వకంగా తన భుజంతో సామ్‌ను ఢీకొట్టాడని ఆరోపణలు వచ్చినప్పటికీ, మ్యాచ్ రిఫరీ అతడికి కేవలం 20 శాతం ఫైన్ తో పాటూ ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా చేర్చారు. కానీ ఆసీస్ మీడియా మాత్రం కోహ్లీపై “క్లౌన్” (జోకర్) అనే పదంతో తీవ్రమైన విమర్శలు చేసింది.
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, కోహ్లీపై కనీసం ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేయాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’ పేపర్ కోహ్లీని జోకర్ అని విమర్శించింది. సామ్ కాన్స్టాస్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే విపరీతంగా ఆకట్టుకుని, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై 34 పరుగులు చేసి హైలైట్ అయ్యాడు.
BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ సంఘటనపై మాట్లాడుతూ, “క్రికెట్ మైదానంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. అవి ఆటలో భాగం. వాటిని అంగీకరించి ముందుకు సాగాలి” అని అన్నారు. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, సామ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, “అతడు అనుకోకుండా నన్ను ఢీకొట్టాడు. ఇది కేవలం క్రికెట్‌లో ఉండే టెన్షన్” అని చెప్పాడు.
ఇలాంటి సంఘటనలు క్రికెట్‌కు కొత్త కోణాలు తీసుకువస్తాయి, కానీ ఆటగాళ్లపై సమన్యాయం ఉండాలి అని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Australian media choose to use "Clown Kohli" instead of celebrating Sam Konstas debut. This is why Virat Kohli is brand in Australia. Reason to increase the number of sales of newspapers. 🤡#INDvsAUS pic.twitter.com/B1ksAPfgI3
— Akshat (@AkshatOM10) December 26, 2024