RR vs KKR Preview: రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ కొట్టేందుకు రెడీ.. రికార్డులు ఇవే..

RR vs KKR IPL 2024 Preview: రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 5 ఓటములు సాధించింది. ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. జట్టు రన్ రేట్ 0.273లుగా నిలిచింది. ఇదే స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించింది. కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది.

RR vs KKR Preview: రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ కొట్టేందుకు రెడీ.. రికార్డులు ఇవే..
Rr Vs Kkr Preview
Follow us
Venkata Chari

|

Updated on: May 19, 2024 | 11:03 AM

RR vs KKR IPL 2024 Preview: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ IPL 2024 ప్లేఆఫ్‌లకు చేరుకున్నాయి. సూపర్ సండే రెండో మ్యాచ్‌లో ఈ రెండు జట్లు అనధికారిక మ్యాచ్‌లో తలపడనున్నాయి. రాజస్థాన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా రాజస్థాన్ స్థానంలో మార్పు రావొచ్చు. ప్రస్తుతం కోల్‌కతా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.

రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 5 ఓటములు సాధించింది. ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. జట్టు రన్ రేట్ 0.273లుగా నిలిచింది. ఇదే స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించింది. కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. అయితే, పంజాబ్ కింగ్స్‌కి ఓటమి పాలయితే, హైదరాబాద్ 17 పాయింట్లతో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌ను అధిగమించే ఆస్కారం ఉంటుంది. హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంటుంది. సన్‌రైజర్స్ రన్ రేట్ కూడా రాయల్స్ కంటే మెరుగ్గా ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ హెడ్ టు హెడ్ రికార్డ్..

ఇరుజట్ల మధ్య 29 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇరు జట్లు తలో 14 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్ డ్రా అయింది. ప్రతిసారీ ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లు హెడ్ టు హెడ్ రికార్డులు చెబుతున్నాయి. ఈసారి కూడా ఇరు జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. కోల్‌కతా మొదటి స్థానంలో ఉండగా, రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: రహమానుల్లా గుర్బాజ్ (కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

స్క్వాడ్‌లు:

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(c), రింకు సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ సుయాష్ శర్మ, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, దుష్మంత చమీర, శ్రీకర్ భరత్, చేతన్ సకారియా, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, సాకిబ్ హుస్సేన్, అల్లా ఘజన్‌ఫర్.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్(w/c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజువేంద్ర చాహల్, తనుష్ కొటియన్, కేశవ్ మహరాజ్, నాంద్రే బర్గర్, కుల్దీప్ సేన్, డోనోవన్ ఫెరీరా, షిమ్రాన్ హెట్మెయర్, అబిద్ ముస్తాక్, శుభమ్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్, నవదీప్ సైనీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..