AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs MI: ఐపీఎల్‌లో ఫస్ట్‌ వికెట్‌ తీసిన అర్జున్‌ టెండూల్కర్‌.. రోహిత్ సెలబ్రేషన్స్‌ చూశారా? వీడియో వైరల్‌

సన్‌రైజర్స్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా రోహిత్‌ బంతిని అర్జున్‌కు అప్పగించాడు. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని జూనియర్‌ టెండూల్కర్‌ వమ్ము చేయలేదు. పదునైన స్వింగ్ బంతులతో హైదరాబాద్‌ టెయిలెండర్లను హడలెత్తించాడు. ఇక భువనేవ్వర్‌ వికెట్‌ తీయగానే కెప్టెన్‌ రోహిత్‌ పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్‌ని అభినందించాడు.

SRH vs MI: ఐపీఎల్‌లో ఫస్ట్‌ వికెట్‌ తీసిన అర్జున్‌ టెండూల్కర్‌.. రోహిత్ సెలబ్రేషన్స్‌ చూశారా? వీడియో వైరల్‌
Mumbai Indians
Basha Shek
|

Updated on: Apr 19, 2023 | 8:46 AM

Share

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌లో మొదటి వికెట్‌ తీశాడు. మంగళవారం ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ను ఔట్‌ చేసి ఐపీఎల్‌లో వికెట్ల బోణీ చేశాడు. 19.5 బంతిని భువనేవ్వర్‌ భారీ షాట్‌కు యత్నించగా రోహిత్‌ బంతిని అందుకున్నాడు. సన్‌రైజర్స్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా రోహిత్‌ బంతిని అర్జున్‌కు అప్పగించాడు. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని జూనియర్‌ టెండూల్కర్‌ వమ్ము చేయలేదు. పదునైన స్వింగ్ బంతులతో హైదరాబాద్‌ టెయిలెండర్లను హడలెత్తించాడు. ఇక భువనేవ్వర్‌ వికెట్‌ తీయగానే కెప్టెన్‌ రోహిత్‌ పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్‌ని అభినందించాడు. ఆతర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇతర ముంబై జట్టు సభ్యులందరూ అర్జున్‌ దగ్గరకు వచ్చి కంగ్రాట్స్‌ తెలిపారు. ఇక గ్యాలరీలో ఉన్న రోహిత్ సతీమణి రితికా, ముంబై ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున హర్ష ధ్వానాలతో స్టేడియాన్ని హోరెత్తించారు.  కాగా ఈ మ్యాచ్‌లో మొత్తం 2.5 ఓవర్లు వేసిన జూనియర్‌ టెండూల్కర్‌ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

బాగా ఆడావ్‌ అర్జున్‌..

కాగా గత రెండేళ్లుగా ముంబై టీంతోనే ఉన్నప్పటికీ తుది జట్టులో అర్జున్‌కు చోటు దక్కలేదు. ఎట్టకేలకు కోల్‌కతా నైటరైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. 2 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కాగా అర్జున్‌ టెండూల్కర్‌ ప్రదర్శనపై మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసలు కురిపించాడు. ‘అర్జున్‌ రాణిస్తుండడం చూస్తే సంతోషంగా ఉంది. తండ్రిగా సచిన్‌ గర్వపడి ఉంటాడు. అర్జున్‌ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తోంది. బాగా ఆడావ్‌ అర్జున్‌. భవిష్యత్‌లో నువ్వు అందుకునే గొప్ప ఘనతలకు ఇది ప్రారంభం’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..