Pawan Kalyan: ‘ఫైర్‌ స్ట్రామ్‌ ఈజ్‌ కమింగ్‌’.. ఐపీఎల్‌లో పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌.. వైరలవుతోన్న SRH పోస్ట్

ఐపీఎల్‌లో కూడా పవర్‌స్టార్‌ పేరు గట్టిగా వినిపిస్తోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక ట్రెండీ పోస్టుతో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షించింది. పవర్‌ స్టార్‌ తన ట్రేడ్‌ మార్క్‌ ఎర్ర టవల్ వేసుకున్న ఫొటోకు, కెప్టెన్ మార్‌క్రమ్ ఆరెంజ్ కలర్ రుమాలు ధరించిన ఫొటోను జత చేసింది. దీనికి 'ఫైర్ స్టార్మ్ ఈజ్‌ కమింగ్‌' అనే క్రేజీ క్యాప్షన్‌ను జోడించింది.

Pawan Kalyan: 'ఫైర్‌ స్ట్రామ్‌ ఈజ్‌ కమింగ్‌'.. ఐపీఎల్‌లో పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌.. వైరలవుతోన్న SRH పోస్ట్
Pawan Kalyan, Srh
Follow us
Basha Shek

|

Updated on: Apr 19, 2023 | 9:19 AM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఆయనకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఈక్రమంలో ఐపీఎల్‌లో కూడా పవర్‌స్టార్‌ పేరు గట్టిగా వినిపిస్తోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక ట్రెండీ పోస్టుతో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షించింది. పవర్‌ స్టార్‌ తన ట్రేడ్‌ మార్క్‌ ఎర్ర టవల్ వేసుకున్న ఫొటోకు, కెప్టెన్ మార్‌క్రమ్ ఆరెంజ్ కలర్ రుమాలు ధరించిన ఫొటోను జత చేసింది. దీనికి ‘ఫైర్ స్టార్మ్ ఈజ్‌ కమింగ్‌’ అనే క్రేజీ క్యాప్షన్‌ను జోడించింది. ఉప్పల్‌లో మంగళవారం (ఏప్రిల్‌ 19) రాత్రి ముంబైతో మ్యాచ్‌కు ముందు ఈ ట్వీట్ వేసింది సన్‌రైజర్స్‌. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా పేరులో హైదరాబాద్‌ ఉన్నా సన్‌రైజర్స్‌ జట్టులో ఒక్క తెలుగు ప్లేయర్‌ లేకుండడంపై విమర్శలు వస్తున్నాయి. అందుకే స్థానిక అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాటను కూడా వాడేసింది. తాజాగా పవన్‌ కల్యాణ్‌ ఫొటోను కూడా షేర్‌ చేసి లోకల్‌ ఫ్యా్న్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ రోజే.. పవన్‌ ‘ఓజీ’ (వర్కింగ్‌ టైటిల్) షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టాడు. సాహో డైరెక్టర్‌ సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ కొత్త సినిమాకు మొదటి నుంచి ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు అదే ట్యాగ్‌ను వాడుకుని.. పవన్‌తో మార్‌క్రమ్‌కు పోలిక పెడుతూ ట్వీట్‌ చేసింది సన్‌రైజర్స్‌. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..