IPL 2022 Player Auction: ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 వేలం.. ఈ మెగా ఈవెంట్ ఎక్కడ జరుగనుందంటే..

IPL 2022 Player Auction: ఐపీఎల్ 2022 వేలానికి బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండు రోజుల..

IPL 2022 Player Auction: ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 వేలం.. ఈ మెగా ఈవెంట్ ఎక్కడ జరుగనుందంటే..
IPL 2022 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022కి ముందు మెగా వేలానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 10 ఫ్రాంఛైజీలు 590 మంది ఆటగాళ్ల (370 భారతీయులు, 220 ఓవర్సీస్) జాబితా నుంచి ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ 590 మంది క్రికెటర్లలో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు ఉన్నారు. IPL 2022 వేలంలో అత్యధిక బిడ్లను ఆకర్షించగల భారతీయ, విదేశీ ఆటగాళ్లను ఓసారి చూద్దాం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 01, 2022 | 4:29 PM

IPL 2022 Player Auction: ఐపీఎల్ 2022 వేలానికి బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ IPL 2022 మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. బెంగళూరు వేదికగా ఐపీఎల్ సీజన్ 15 కు సంబంధించిన వేలాన్ని నిర్వహిస్తామని బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, కర్ణాటక ప్రభుత్వం కోవిడ్-19 పరిమితులను ఎత్తివేసిన నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం హోటల్ బుకింగ్ ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది.

“బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12 & 13 తేదీల్లో వేలం నిర్వహించడం జరుగుతుంది. ఈ వేలానికి సంబంధించి రాష్ట్ర క్రికెట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నాం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు ఆంక్షలు ఎత్తివేయడంతో నగరంలో ఆటగాళ్ల వేలానికి ముందడుగు వేయడం జరిగింది.” అని BCCI సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

గత వారం జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశం తర్వాత బీసీసీఐ కార్యదర్శి జే షా ఐపీఎల్ 2022 వేలం తేదీలను ఒక ప్రకటనలో ధృవీకరించారు. అయితే, థర్డ్ వేవ్ రూపంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వేలానికి బెంగళూరు ఆతిథ్యం ఇవ్వగలదా? అనే సందేహంలో ఇప్పటి వరకు ఉంది బీసీసీఐ. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో ఆటగాళ్ల వేలానికి సన్నాహాలు ప్రారంభించింది బీసీసీఐ.

ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ వేలం నిర్వహించనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఫిబ్రవరి 11నే బెంగళూరుకు చేరుకోవాలని సూచించింది బీసీసీఐ. అదే రోజు ఈవెంట్‌కు సంబంధించి మాక్ వేలం నిర్వహించనున్నారు. 12, 13 తేదీల్లో అసలైన ఈవెంట్‌ను నిర్వహిస్తారు. అయితే, గత సంవత్సరం హ్యూ ఎడ్మీడ్స్ వేలం నిర్వహించాడు. మరి రెండవసారి కూడా అతనే వస్తాడా? లేక ఐపీఎల్ వేలంపాటదారుగా ప్రసిద్ధి చెందిన రిచర్డ్ మాడ్లీ వస్తాడా? అనేది క్లారిటీ లేదు.

బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 590 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొననున్నారు. ఆటగాళ్ల వేలం జాబితా ముగిసింది. వేలం కోసం నమోదు చేసుకున్న 590 మంది ఆటగాళ్లలో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు. మొత్తం 370 మంది భారత ఆటగాళ్లు, 220 మంది విదేశీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియా నుండి 47 మంది ఆటగాళ్ళు ఉండగా, వెస్టిండీస్ (34), దక్షిణాఫ్రికా (33) మంది ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు.

ఇదిలాఉంటే.. శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, అజింక్యా రహానే, సురేశ్ రైనా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ వంటి అత్యుత్తమ భారత క్రికెట్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల నుంచి ఎక్కువ పోటీ ఉండనుంది. ఇక శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, తదితరులకు కూడా డిమాండ్ బాగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ వేలంలో 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. వీటిలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, టీమ్ అహ్మదాబాద్ టాప్ ప్లేయర్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కాగా.. డుప్లెసిస్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, కగిసో రబడ, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డి కాక్, జానీ బెయిర్‌స్టో, జాసన్ హోల్డర్, డ్వేన్ బ్రేవో, షకీబ్ అల్ హసన్, వనిందు హసరంగా వంటి ముఖ్యమైన ప్లేయర్లు వేలంలో ఉన్నారు. ఇక రూ. 2 కోట్లు అత్యధిక రిజర్వ్ ధరతో 48 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. రూ. 1.5 కోట్ల రిజర్వ్ ధరతో 20 మంది ఆటగాళ్లు వేలం జాబితాలో ఉండగా, 34 మంది ఆటగాళ్లు రూ. 1 కోటి రిజర్వ్ ధర కలిగిన క్రికెటర్ల జాబితాలో ఉన్నారు.

“ఐపీఎల్ 15వ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమై మే నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఈ టోర్నీని భారత్‌లోనే నిర్వహించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్ ఇండియాలోనే నిర్వహిస్తాం. అందుకు సంబంధించిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోము.’’ అని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా గతవారం మీడియాకు తెలిపారు.

Also read:

Hyderabad: వావ్.. కేబీఆర్ పార్క్‌లో పురివిప్పి నాట్యం చేసిన నెమలి..

Bihar CM on Budget: దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం అభినందనీయంః బీహార్ సీఎం నితీష్ కుమార్

Viral Video: కన్నబిడ్డను ఎలుగుబంటి బోన్‌లోకి విసిరేసిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వైరల్‌ అవుతోన్న వీడియో..

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!