AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కన్నబిడ్డను ఎలుగుబంటి బోన్‌లోకి విసిరేసిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: ప్రాంతం, బాషకు అతీతంగా ఉండేది తల్లి ప్రేమ ఒక్కటే అని చెబుతుంటారు. ఏ తల్లి అయినా తన బిడ్డ క్షేమం కోసం ఆరాటపడుతుంటుంది. అందుకోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. బిడ్డను కాపాడడం కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తూ వారికోసం..

Viral Video: కన్నబిడ్డను ఎలుగుబంటి బోన్‌లోకి విసిరేసిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వైరల్‌ అవుతోన్న వీడియో..
representative image
Narender Vaitla
|

Updated on: Feb 01, 2022 | 4:13 PM

Share

Viral Video: ప్రాంతం, బాషకు అతీతంగా ఉండేది తల్లి ప్రేమ ఒక్కటే అని చెబుతుంటారు. ఏ తల్లి అయినా తన బిడ్డ క్షేమం కోసం ఆరాటపడుతుంటుంది. అందుకోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. బిడ్డను కాపాడడం కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తూ వారికోసం అనుక్షణం పరితపిస్తుంటుంది. కానీ ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఓ అమ్మ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. రక్షించాల్సిన కన్న తల్లే, కూతురు పాలిట యముడిగా మారింది. కన్నబిడ్డను ఏకంగా ఎలుగుబంటికి ఆహారంగా విసిరేసింది. ప్రస్తుతం ఈ షాకింగ్‌ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లోని జూకి ఒకావిడా తన మూడేళ్ల చిన్నారితో వచ్చింది. ఎలుగుబంటి ఉండే ఓపెన్‌ ఎన్‌క్లోజర్‌ వద్ద నిల్చొని ఎలుగుబంటిని చూపించసాగింది. అయితే ఏమైందో ఏమో కానీ ఆ చిన్నారిని పైకెత్తి ఎలుగుబంటి ఉన్న చోట విసిరేసింది. దీంతో ఒక్కసారిగా పక్కన ఉన్నవారంతా బిగ్గరగా అరిచారు. ఈ విషయం తెలసుకున్న వెంటనే జూ నిర్వాహకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షణాల్లో ఆ ఎలుగుబంటిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఆ చిన్నారి చిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది.

ఈ సంఘటనంతా అక్కడే ఉన్న ఓ సిసిటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఆ వీడియోలో చూస్తుంటే తల్లి ఉద్దేశపూర్వకంగానే బిడ్డను విసిరేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు ఆ తల్లిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒ కన్న తల్లి బిడ్డను ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సదరు తల్లిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ నేరం రుజువైతే ఆమెకు 15 ఏళ్లు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Super Over: సూపర్ ఓవర్‌లో దుమ్మురేపిన వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు.. దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి..

Budget 2022: బంపర్‌ ఆఫర్స్‌.. నిర్మలమ్మ బడ్జెట్‌లో తగ్గినవి ఇవే.. చౌకగా మొబైల్ ఫోన్స్

Budget 2022: బంపర్‌ ఆఫర్స్‌.. నిర్మలమ్మ బడ్జెట్‌లో తగ్గినవి ఇవే.. చౌకగా మొబైల్ ఫోన్స్