Super Over: సూపర్ ఓవర్‌లో దుమ్మురేపిన వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు.. దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి..

క్రికెట్ మ్యాచ్ సూపర్ ఓవర్‌ వరకు వెళ్లిందంటే ఆ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్‌గా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓ జట్టు 25 పరుగులు చేసింది...

Super Over: సూపర్ ఓవర్‌లో దుమ్మురేపిన వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు.. దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి..
Windies
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 01, 2022 | 2:03 PM

క్రికెట్ మ్యాచ్ సూపర్ ఓవర్‌ వరకు వెళ్లిందంటే ఆ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్‌గా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓ జట్టు 25 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 40.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సీన్ లస్ 46 పరుగులు చేశాడు.

ఛేదనలో విండీస్‌ 37.4 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్‌ టై అయింది. దక్షిణాఫ్రికా తరఫున అయోబొంగా ఖాకా 26 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్‌ మహిళలెవరూ హాఫ్‌ సెంచరీ చేయలేదు. చివరి వన్డేలో సెంచరీ చేసిన డియాండ్రా డాటిన్ 37 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది.

ఇందులో విండీస్‌ ప్లేయర్లు దియాంద్ర డాటిన్ ఐదు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 19 పరుగులు చేయగా హేలీ మాథ్యూస్‌ సిక్స్ కొట్టారు. వీరిద్దరూ ఆరు బంతుల్లో 25 పరుగులు సాధించి దక్షిణాఫ్రికా బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మేయిల్‌కు చెమటలు పట్టించారు. తొలి బంతికి డాటిన్‌ రెండు పరుగులు తీయగా తర్వాత వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌, మూడు పరుగులు సాధించింది. ఇక చివరి బంతికి హేలీ మరో సిక్సర్‌ సంధించింది. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లో ట్రియాన్‌ (7), తజ్మిన్‌ బ్రిట్స్‌(10) ధాటిగా ఆడినా చివరికి 17 పరుగులు సాధించి మ్యాచ్‌లో ఓడిపోయారు.

Read Also.. ind vs wi: క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పిన బెంగాల్ ప్రభుత్వం.. అందుకు గ్రీన్ సిగ్నల్..