Bihar CM on Budget: దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం అభినందనీయంః బీహార్ సీఎం నితీష్ కుమార్
CM Nitish Kumar: సాధారణ బడ్జెట్‌పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సానుకూలంగా ఉందని, స్వాగతిస్తున్నామని చెప్పారు.
Bihar CM on Budget 2022: సాధారణ బడ్జెట్‌పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం(Union Government) ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget 2022) సానుకూలంగా ఉందని, స్వాగతిస్తున్నామని చెప్పారు. సీఎం నితీష్ కుమార్ ట్వీట్ చేసి బడ్జెట్ అభినందనీయమని అభివర్ణించారు. గత రెండేళ్లుగా, కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థికాభివృద్ధి ప్రభావితమైంది. ఈ అసహజ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ద్వారా దేశాభివృద్ధి వేగాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవడం కూడా స్వాగతించదగ్గదే. గంగానది రెండు ఒడ్డున ఉన్న 13 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులతో ఆర్గానిక్ కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం అభినందనీయమని నితీష్ కుమార్ పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో గంగానది ఒడ్డున 5 కిలోమీటర్ల పరిధిలో సహజ వ్యవసాయ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఈ బడ్జెట్‌లో వరి, గోధుమల కొనుగోళ్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల కొత్త ఇళ్లను నిర్మించాలన్న నిర్ణయం స్వాగతించదగినది. ఈ ఏడాది, వచ్చే ఏడాది కేంద్ర పన్నుల వాటాగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ మొత్తం లభించనుంది.దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టడంతో పాటు రాష్ట్రాలకు ఊరట లభించనుందని బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
केन्द्रीय बजट सकारात्मक एवं स्वागत योग्य हैः मुख्यमंत्री @NitishKumar केन्द्रीय बजट में गंगा के किनारे 5 किलोमीटर के स्ट्रेच में प्राकृतिक खेती का कोरिडोर विकसित करने का निर्णय सराहनीय है। pic.twitter.com/omkyCVvN3X
— IPRD Bihar (@IPRD_Bihar) February 1, 2022
ఒకవైపు 2022 23 సార్వత్రిక బడ్జెట్‌ను బీహార్ సీఎం నితీశ్ కుమార్ అభినందిస్తూనే మరోవైపు ఆయన పార్టీ నేత ఉపేంద్ర కుష్వాహా నిరాశపరిచిందన్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఆధారంగా బడ్జెట్ నిరాశపరిచిందని కుష్వాహా అభివర్ణించారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమని, అయితే బీహార్‌కు నిరాశ కలిగించిందని ఆయన ట్వీట్ చేశారు. బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను విస్మరించడం ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీ బీహారీలందరినీ విస్మరించారన్నారు.
केन्द्रीय बजट विकसित राज्यों के लिए ऐतिहासिक, परन्तु #बिहार के लिए निराशाजनक है। वित्तमंत्री श्रीमती @nsitharaman जी ने बिहार को #विशेष_राज्य का दर्जा देने की मांग को अनसुना कर हमसभी बिहारवासियों को निराश किया है।#देश_के_प्रधान_बिहार_पर_दें_ध्यान #BudgetSession2022
— Upendra Kushwaha (@UpendraKushJDU) February 1, 2022
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పేదల సంక్షేమ బడ్జెట్ అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. భయంకరమైన విపత్తుల మధ్య ఈ బడ్జెట్ అభివృద్ధిపై కొత్త విశ్వాసాన్ని తెచ్చిందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత వృద్ధి మరియు మరిన్ని ఉద్యోగాల కొత్త అవకాశాలతో బడ్జెట్ నిండి ఉంది.