IPL 2022: ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టాడు.. కోల్‌కతాకు గుండెకోత మిగిల్చాడు..
LSG Vs KKR, IPL 2022: కేకేఆర్ విజయానికి చివర్లో 2 బంతుల్లో 3 పరుగులు కావల్సి ఉండగా..రింకూసింగ్ ఆడిన భారీ షాట్‌ను ఎక్కడో దూరంగా ఉన్న ఎవిన్ లూయిస్ పరిగెత్తుకుంటూ వచ్చి పర్ఫెక్ట్ డైవింగ్‌తో ఎడమచేత్తో అందుకున్నాడు.
LSG Vs KKR, IPL 2022: క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అన్నట్లు క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా ముఖ్యమే. ఒక్కోసారి అవే మ్యాచ్‌లకు గెలిపిస్తాయి. లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (LSG Vs KKR) బుధవారం రాత్రి జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో ఈ మాటలు మరోసారి నిజమయ్యాయి. చివరివరకూ రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేవలం 2 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో విజయం అంచులవరకూ వచ్చి ఓడిపోవడానికి కారణం ఎవిన్ లూయిస్ తీసుకున్న అద్భుతమైన క్యాచ్. కేకేఆర్ విజయానికి చివర్లో 2 బంతుల్లో 3 పరుగులు కావల్సి ఉండగా..రింకూసింగ్ ఆడిన భారీ షాట్‌ను ఎక్కడో దూరంగా ఉన్న ఎవిన్ లూయిస్ పరిగెత్తుకుంటూ వచ్చి పర్ఫెక్ట్ డైవింగ్‌తో ఎడమచేత్తో అందుకున్నాడు. అంతే.. అప్పటివరకు ధాటిగా ఆడుతూ కోల్‌కతా విజయంపై ఆశలు రేకెత్తించిన రింకూ సింగ్ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తరువాత బంతికి ఉమేష్ యాదవ్ క్లీన్‌బౌల్డ్ అవడంతో 2 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది . కోల్‌కతా భారంగా…ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
విజయానికి చేరువగా వచ్చి..
కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 210 పరుగుల స్కోరు సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్‌కతా ప్రారంభంలో వికెట్లు కోల్పోయినా ధాటిగానే ఆడింది. అయితే 15 ఓవర్లు ముగిసేసరికి సగం వికెట్లు కోల్పోయింది. రిక్వైర్డ్ రన్‌రేట్ కూడా ఏకంగా 20 దాటి పోయింది. దీంతో విజయంపై ఆశలు వదిలేసుకుంది కోల్‌కతా. అయితే ఆ తరుణంలో రింకూ సింగ్ (15 బంతుల్లో 40, 2ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కేకేఆర్ ను విజయం అంచులవరకూ తీసుకెళ్లింది. ఇక ఆఖరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు అవసరమవ్వగా రింకూ దూకుడును చూస్తుంటే కొట్టేలానే కనిపించాడు. అందుకు తగ్గట్లే మార్కస్ స్టొయినిస్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 4,6,6గా హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. దీంతో కోల్‌కతా విజయ సమీకరణం3 బంతుల్లో 5 పరుగులకు మారిపోయింది. కోల్‌కతా విజయం ఖాయమని అంతా భావించారు. అయితే రింకూ ఆడిన భారీ షాట్‌ను ఎవిన్ లూయిస్ అద్భుతంగా ఒడిసిపట్టుకోవడంతో విజయానికి రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది కోల్‌కతా.
Evin Lewis with a one handed Blinder, my goodness. What a game, what a finish.@klrahul @bishnoi0056 @LucknowIPL pic.twitter.com/UVwdMLODGz
— VISHU MOHANLAL KARWASRA?? (@Vishnukarwasra2) May 18, 2022
Evin Lewis, just unbelievable. What a one handed catch.#IPL20222 #KKRvsLSG pic.twitter.com/7EJcQVMLvY
— Harish Jangid (@HarishJ56732474) May 18, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: