IPL 2022: ఐపీఎల్ ఫైనల్‌పై బీసీసీఐ పెద్ద మార్పు.. టైటిల్ పోరు ఎప్పుడంటే..?
IPL 2022: ఐపీఎల్ 2022 టోర్నమెంట్ చివరి దశకి చేరింది. కేవలం 4 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీని తర్వాత ప్లేఆఫ్ రౌండ్ ప్రారంభమవుతుంది. మే 29న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
Updated on: May 19, 2022 | 3:07 PM

ఐపీఎల్ 2022 టోర్నమెంట్ చివరి దశకి చేరింది. కేవలం 4 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీని తర్వాత ప్లేఆఫ్ రౌండ్ ప్రారంభమవుతుంది. మే 29న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ 2022 ఫైనల్‌లో బీసీసీఐ చిన్న మార్పు చేసింది.

నిజానికి BCCI IPL 2022 ఫైనల్ టైమింగ్‌ని మార్చింది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. బీసీసీఐ ఈ నిర్ణయానికి కారణం వెల్లడించలేదు.

వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత సీజన్ గురించి మాట్లాడితే లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే. నాలుగో స్థానం కోసం ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ మధ్య పోటీ నెలకొంది.

మే 24 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్ ఉంటుంది. దీని తర్వాత మే 25న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. మే 27న క్వాలిఫయర్ 2, చివరిగా మే 29న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.



