Indian Cricket Team: అండర్-19 ఆటగాళ్లతో భారత పరిమిత ఓవర్ల సారథి.. ఏం చేశాడో తెలుసా?

India U19 Team: గాయం నుంచి కోలుకోవడానికి ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి చేరుకున్నాడు. ఇక్కడ భారత అండర్-19 జట్టు కూడా ఆసియా కప్‌కు సిద్ధమవుతోంది. ఈ సమయంలో రోహిత్ శర్మ..

Indian Cricket Team: అండర్-19 ఆటగాళ్లతో భారత పరిమిత ఓవర్ల సారథి.. ఏం చేశాడో తెలుసా?
Rohit Sharma
Follow us

|

Updated on: Dec 19, 2021 | 9:17 AM

Rohit Sharma: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోవడానికి ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి చేరుకున్నాడు. ఇక్కడ భారత అండర్-19 జట్టు కూడా ఆసియా కప్‌కు సిద్ధమవుతోంది. ఈ సమయంలో రోహిత్ శర్మ ఈ యువ ఆటగాళ్లకు చిట్కాలు ఇస్తూ కనిపించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అండర్-19 జట్టు డిసెంబర్ 23 నుంచి యూఏఈలో ఆసియా కప్ ఆడనుంది. రోహిత్ ఈ ఆటగాళ్లతో ఒక ఫోటోను కూడా పంచుకున్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తుతో సంభాషణ అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు.

టెస్టు టీమ్‌కి రోహిత్‌ దూరం.. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం కానుంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవని ఏకైక జట్టుగా నిలిచింది.

Rohit Sharma (2)

దక్షిణాఫ్రికా పిచ్ స్వింగ్, స్పీడ్, బౌన్స్‌కు ప్రసిద్ధి. ఇక్కడ టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ చాలా కష్టపడుతుంటుంటారు. అదే సమయంలో, గత ఏడాది కాలంగా, రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్‌లలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో, అతను దక్షిణాఫ్రికాలో జరిగే టెస్ట్ సిరీస్‌కు మిస్ అవ్వడం కాస్త బాధగానే ఉంది.

వన్డే సిరీస్ వరకు ఫిట్‌గా హిట్‌మ్యాన్.. రోహిత్ శర్మ వన్డే సిరీస్ వరకు ఫిట్‌గా ఉండగలడని నమ్ముతున్నారు. వన్డే జట్టుకు రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఒకవేళ అతను దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడితే, రోహిత్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ ఆడటం ఇదే తొలిసారి కానుంది.

Also Read: IPL 2022: టీమిండియా మాజీ ప్లేయర్ సరికొత్త ఇన్నింగ్స్.. ఆ ఫ్రాంచైజీతో ఐపీఎల్‌ 2022లో రీ ఎంట్రీ..!

‌HBD Ricky Ponting: 2003లో భారత అభిమానుల కన్నీటికి కారణమైన ఆసీస్ సారథి.. 3 ప్రపంచకప్‌లు అందించి చరిత్రలో నిలిచాడు..!