- Telugu News Photo Gallery Cricket photos On This Day: Team India Former Player Sachin Tendulkar slams record 50th Test Hundred, India vs South Africa in Centurion
IND vs SA: లిటిల్ మాస్టర్ అరుదైన రికార్డుకు 11 ఏళ్లు.. తోడుగా నిలిచిన ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాలే..!
Sachin Tendulkar: క్లిష్ట పరిస్థితిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, టీమిండియా మాత్రం..
Updated on: Dec 19, 2021 | 9:47 AM

India vs South Africa 2021: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంది. అక్కడ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం, ఈ రోజున, సచిన్ టెండూల్కర్ ఓ రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఏ ఆటగాడి బ్యాగులో లేని రికార్డును బద్దలు కొట్టాడు. అయినప్పటికీ భారత్‌కు ఘోర పరాజయం నుంచి తప్పించలేకపోయాడు.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ 16 డిసెంబర్ 2010న సెంచూరియన్‌లో జరిగింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 136 పరుగులకే ఆలౌటైంది. దీనికి సమాధానంగా, గ్రేట్ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ తొలి డబుల్ సెంచరీ, హషీమ్ ఆమ్లా-ఏబీ డివిలియర్స్ సెంచరీల సహాయంతో దక్షిణాఫ్రికా 620/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 484 పరుగులకే ఆలౌటైంది. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ హాఫ్ సెంచరీలు చేసినా.. అసలైన ఆకర్షణ మాత్రం సచిన్ టెండూల్కర్‌పైనే నిలిచింది. గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ డిసెంబర్ 19న అంటే సరిగ్గా 11 సంవత్సరాల క్రితం డేల్ స్టెయిన్, మోర్నె మోర్కెల్ వంటి బౌలర్ల ముందు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 50వ టెస్ట్ సెంచరీని సాధించిన సచిన్, ఈ మైలురాయిని తాకిన మొదటి, ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

జట్టు ఓటమిని తప్పించేందుకు ధోనీతో కలిసి సచిన్ తన వంతు ప్రయత్నం చేశాడు. వీరిద్దరి మధ్య ఏడో వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 106 బంతుల్లో 90 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ధోని ఔటయ్యాడు. ఆపై డిసెంబర్ 20న ఐదో రోజున భారత్ ఇన్నింగ్స్ 459 పరుగులకు ముగిసింది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 25 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 111 పరుగులతో సచిన్ నాటౌట్‌గా వెనుదిరిగాడు.





























