Asia Cup 2023, IND vs PAK: క్యాండీలో భారత్, పాక్ మ్యాచ్.. ఈ మైదానంలో ఇరుజట్ల ప్రదర్శన ఎలా ఉందంటే?
IND vs PAK: ఈ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు రికార్డులను చూస్తే, ఆ జట్టు కంగారు పడాల్సిందే. ఇక్కడ పాకిస్తాన్ మొత్తం ఐదు వన్డేలు ఆడగా, 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాక్ జట్టు అత్యధిక స్కోరు 287 పరుగులుగా నిలిచింది. 2009లో ఈ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ 9 టెస్టు మ్యాచ్‌లు, 23 టీ20 మ్యాచ్‌లు, 33 వన్డేలు జరిగాయి.

Indian Team Records, Stats At Pallekele International Cricket Stadium: భారత జట్టు తమ ఆసియా కప్ ప్రచారాన్ని పాకిస్థాన్‌తో ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మైదానంలో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంది, అలాగే క్యాండీలో భారత జట్టు గణాంకాలను ఇప్పుడు చూద్దాం.
పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టీమిండియాదే రికార్డులు..
భారత జట్టు శ్రీలంక క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇక్కడ టీమిండియా ప్రదర్శన చాలా బాగుంది. భారత జట్టు రికార్డు ఈ స్టేడియంలో వంద శాతంగా నిలిచింది. ఈ స్టేడియంలో టీమిండియా మొత్తం 3 మ్యాచ్‌లు ఆడి, మూడింట్లోనూ గెలిచింది. అత్యధిక స్కోరు 294 పరుగులుగా నిలిచింది.




ఈ గడ్డపై పాకిస్థాన్ రికార్డులు ఇప్పుడు చూద్దాం?
View this post on Instagram
కాగా, ఈ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు రికార్డులను చూస్తే, ఆ జట్టు కంగారు పడాల్సిందే. ఇక్కడ పాకిస్తాన్ మొత్తం ఐదు వన్డేలు ఆడగా, 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాక్ జట్టు అత్యధిక స్కోరు 287 పరుగులుగా నిలిచింది. 2009లో ఈ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ 9 టెస్టు మ్యాచ్‌లు, 23 టీ20 మ్యాచ్‌లు, 33 వన్డేలు జరిగాయి.
ఆసియా కప్ ప్రారంభోత్సవ ఈవెంట్..
View this post on Instagram
టీమిండియా స్వ్కాడ్..
View this post on Instagram
పాకిస్తాన్ టీం..
View this post on Instagram
ఇరుజట్లు..
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, పర్షిద్ కృష్ణ, సంజు శాంసన్ (రిజర్వ్స్).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




